Hindenburg Report: స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే ఆగస్టు 12న నష్టాలతో ప్రారంభం అయింది. నిజానికి శనివారం రాత్రి హిండెన్‌బర్గ్ సెబీ చీఫ్ మాధబి పురి బుచ్ ను (Madhabi Puri Buch) టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది. దాని ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్ పై గట్టిగా కనిపిస్తుందని.. మార్కెట్లు క్రాష్ అవుతాయని అందరూ భావించారు. అయితే.. ఆ స్థాయిలో మార్కెట్ నష్టపోయినట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిస్థితులు.. ఇతర కారణాల రీత్యా మార్కెట్ ప్రారంభం నష్టాలతో జరిగినట్టు నిపుణులు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Hindenburg Report: అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ మాత్రం గ్రీన్ లోనే!
నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ క్రమేపీ పుంజుకుంది. సెబీ చీఫ్ పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు చెందిన మొత్తం పది షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఆ రిపోర్ట్ ఎఫెక్ట్ మొత్తం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించలేదు.
Translate this News: