Hindenburg Report: అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ మాత్రం గ్రీన్ లోనే!

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ క్రమేపీ పుంజుకుంది. సెబీ చీఫ్ పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు చెందిన మొత్తం పది షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఆ రిపోర్ట్ ఎఫెక్ట్ మొత్తం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపించలేదు.

New Update
Hindenburg Report: అదానీ గ్రూప్ షేర్లపై హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్ మాత్రం గ్రీన్ లోనే!

Hindenburg Report: స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే ఆగస్టు 12న నష్టాలతో ప్రారంభం అయింది. నిజానికి శనివారం రాత్రి  హిండెన్‌బర్గ్ సెబీ చీఫ్ మాధబి పురి బుచ్ ను (Madhabi Puri Buch) టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది. దాని ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్ పై గట్టిగా కనిపిస్తుందని.. మార్కెట్లు క్రాష్ అవుతాయని అందరూ భావించారు. అయితే.. ఆ స్థాయిలో మార్కెట్ నష్టపోయినట్టు కనిపించడం లేదు. అంతర్జాతీయ పరిస్థితులు.. ఇతర కారణాల రీత్యా మార్కెట్ ప్రారంభం నష్టాలతో జరిగినట్టు నిపుణులు భావిస్తున్నారు. 

ఈరోజు  ఉదయం సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనంతో 79,250 స్థాయి వద్ద ప్రారంభం అయింది. నిఫ్టీ కూడా దాదాపు 150 పాయింట్లు నష్టపోయింది. 24,200 స్థాయిలో ట్రేడింగ్ స్టార్ట్ చేసింది. అయితే ఉదయం 10:30 గంటల సమయానికి  కాస్త తేరుకుని నష్టాలను తగ్గించుకుంది. సెన్సెక్స్ 199  పాయింట్ల నష్టంతో 79,506 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ కూడా తేరుకుని అదే సమయానికి 72 పాయింట్ల నష్టంతో 24,925 పాయింట్ల వద్ద నడుస్తోంది. 

 Hindenburg Report: హిండెన్‌బర్గ్ శనివారం విడుదల చేసిన తన నివేదికలో అదానీ గ్రూప్‌కు (Adani Group) అనుసంధానమై ఉన్న  ఆఫ్‌షోర్ కంపెనీలో మాధబి పూరీ బుచ్.. ఆమె భర్త ధవల్ బుచ్ వాటాలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 1.84% క్షీణించాయి. ఈ లెక్కలు పరిశీలిస్తే హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించలేదని అనిపిస్తోంది. 

publive-image

హిండెన్‌బర్గ్ వివాదం ఇదీ..  

Hindenburg Report: హిండెన్‌బర్గ్, శనివారం అర్థరాత్రి విడుదల చేసిన తన కొత్త రిపోర్ట్ లో, అదానీ గ్రూప్‌ లోని నిధుల దుర్వినియోగానికి ఉపయోగించిన విదేశీ నిధులలో సెబీ చైర్‌పర్సన్ బుచ్ .. ఆమె భర్త ధబల్ బుచ్‌లకు వాటాలు ఉన్నాయని పేర్కొంది. ఈ రిపోర్ట్ సంచలనం సృష్టించింది. అయితే, ఇటు సెబీ చీఫ్ అటు అదానీ గ్రూప్ కూడా ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టిపాడేశారు. ఇదంతా హిండెన్‌బర్గ్ కావాలనే బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నమని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు