SBI: ఎస్ బీఐ అకౌెంట్ తీసుకుంటే మనకు ఎన్నో లాభాలు!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్‌ రూపొందించింది. ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయటం ద్వారా వాటి లాభాలు ప్రాసెస్ విశేషాలు బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

SBI: ఎస్ బీఐ అకౌెంట్ తీసుకుంటే మనకు ఎన్నో లాభాలు!
New Update

బ్యాంకులు తమ ఖాతాదారులకు వివిధ రకాల సేవలు అందిస్తాయి. ముఖ్యంగా అందరి అవసరాలకు సరిపోయే స్పెషల్ అకౌంట్లు ఆఫర్ చేస్తాయి. వీటి ద్వారా ఖాతాదారులు స్పెషల్ బెనిఫిట్స్ అందుకోవచ్చు. అయితే దాదాపు అన్ని బ్యాంకులూ ఉద్యోగులు జీతాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించే శాలరీ అకౌంట్స్ అందిస్తాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా, ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్‌ రూపొందించింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం, SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్ బెనిఫిట్స్, అకౌంట్‌ ఓపెన్‌ చేసే ప్రాసెస్ తెలుసుకుందాం.

* SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్ అంటే?

SBI శాలరీ ప్యాకేజీ అకౌంట్ అనేది జీరో బ్యాలెన్స్ అకౌంట్‌. దీని ద్వారా నెట్‌ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యాలకు ఎఫర్ట్‌లెస్‌ యాక్సెస్‌ పొందవచ్చు. ఇది శాలరీడ్‌ ఇండివిడ్యువల్స్‌కి విలక్షణమైన సేవలు అందించే స్పెషల్ సేవింగ్‌ ఆప్షన్‌. కస్టమర్లు శాలరీ ప్యాకేజీ అకౌంట్‌లో మినిమం బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సిన అవసరం లేదు. మినిమం బ్యాలెన్స్ లేనందుకు ఎటువంటి ఛార్జీలు లేవు. ఆటో స్వీప్ ఫెసిలిటీ (ఆప్షనల్‌) అందుబాటులో ఉంటుంది.

కస్టమర్లు తమ సేవింగ్స్‌ అకౌంట్ ఫండ్స్‌ను ఫిక్స్‌డ్ డిపాజిట్‌కి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేసి ఇన్వెస్ట్ చేయవచ్చు. అర్హత ఉన్న కస్టమర్లు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందవచ్చు. అలానే అర్హతకు లోబడి యాన్యువల్‌ లాకర్ రెంట్‌ ఛార్జీలపై రాయితీ ఉంటుంది. వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసులకు సైతం అర్హత పొందవచ్చు.

ఈ జీతం అకౌంట్ తీసుకున్న కస్టమర్లకు బ్యాంక్ స్పెషల్ డెబిట్ కార్డ్‌ అందిస్తుంది. భారతదేశం అంతటా SBI, ఇతర బ్యాంక్ ATMలలో కస్టమర్లు అపరిమిత సంఖ్యలో ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. ఆన్‌లైన్ RTGS/NEFT ఛార్జీలు కూడా ఉండవు. ఎలాంటి ఫీజు లేకుండా ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌ఫర్లు చేయవచ్చు. కస్టమర్‌లు పర్సనల్‌, విమాన ప్రమాదాలపై ఇన్సూరెన్స్‌ కవరేజీ పొందుతారు. పర్సనల్‌ లోన్‌లు, కారు రుణాలు, గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేట్లు పొందుతారు.

 SBI అందించే శాలరీ అకౌంట్‌ ప్యాకేజీలు

SBI విభిన్న రంగాల అవసరాలకు అనుగుణంగా శాలరీ అకౌంట్‌ ప్యాకేజీలను అందిస్తుంది. ఇందులో సెంట్రల్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీ (CGSP), స్టేట్‌ గవర్నమెంట్‌ శాలరీ ప్యాకేజీ (SGSP), రైల్వే శాలరీ ప్యాకేజీ (RSP), డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ (DSP), సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ శాలరీ ప్యాకేజీ (CAPSP), పోలీసు శాలరీ ప్యాకేజీ (PSP), ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజీ (ICGSP), కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (CSP), స్టార్టప్‌ శాలరీ ప్యాకేజీ అకౌంట్‌ (SUSP) ఉన్నాయి.

ఈ అకౌంట్‌ ఎలా ఓపెన్‌ చేయాలి?

ఏదైనా SBI బ్రాంచ్‌లో ఈ అకౌంట్ తీసుకోవచ్చు. యోనో అప్లికేషన్ ద్వారా కూడా దీని కోసం అప్లై చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్‌ చేయడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పాన్ కార్డ్ కాపీ, ఐడెంటిటీ, అడ్రస్‌ ప్రూఫ్‌లు, ఎంప్లాయ్‌మెంట్‌/సర్వీస్‌ సర్టిఫికేట్, లేటెస్ట్‌ శాలరీ స్లిప్ అవసరం. SBIలో ఇప్పటికే ఉన్న సేవింగ్స్ అకౌంట్‌లను శాలరీ ప్యాకేజీ అకౌంట్‌లుగా మార్చుకోవచ్చు. ఇందుకు అప్లికేషన్‌తోపాటు ఎంప్లాయ్‌మెంట్‌ ప్రూఫ్‌, శాలరీస్లిప్/సర్వీస్ సర్టిఫికేట్‌ సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. అకౌంట్‌కి వరుసగా మూడు నెలల కంటే ఎక్కువ కాలం శాలరీ క్రెడిట్స్ లేకపోతే, శాలరీ ప్యాకేజీ కింద అందించే ప్రత్యేక ఫీచర్లు తొలగిస్తారు. తర్వాత నార్మల్ సేవింగ్‌ అకౌంట్‌లానే ఉపయోగించుకోవాలి.

#personal-finance #sbi #state-bank-of-india #bank-accounts
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe