Benefits of Parijata Tree: నిత్యం మనం మన ఇంటి పరిసరాల్లో అనేక రకాల పూల మొక్కలను చూస్తూ ఉంటాం. కొన్ని పూలను పూజకు మాత్రమే ఉపయోగిస్తాం, మరికొన్ని పూలను అలంకరణకు వాడుతుంటాం. ఎక్కువగా పూజకు వాడే పువ్వులలో పారిజాతం పూలు ఒకటి. కేవలం దేవుడి కోసమే వీటిని పెంచేవారు ఉన్నారు. ఇంగ్లీష్‌లో వీటిని నైట్ ఫ్లవరింగ్ జాస్మిన్ అంటారు. ఇవి చూడటానికి అందంగా ఉండటంతో పాటు మంచి వాసన కూడా వస్తాయి. రాత్రి సమయంలో మాత్రమే వికసించి తెల్లారేసరికి రాలిపోతూ ఉంటాయి.
ఇది కూడా చదవండి: ఇంటి ముందు కాకి అరిస్తే ఏం జరుగుతుంది? ప్రత్యేకత ఇదే
అయితే మామూలుగా మనం ఏ పువ్వులనైనా చెట్టు నుంచి తెంపి దేవుడికి సమర్పిస్తాం. కానీ ఈ పారిజాత పువ్వులను మాత్రం చెట్టు నుంచి తెంపకూడదని చెబుతున్నారు. అవి కిందపడిన తర్వాతే తీసుకుని దేవుడి దగ్గర పెట్టాలంటున్నారు. అలా ఆ చెట్టు దేవుడి నుంచి వరం పొందిందని పండితులు అంటున్నారు. కేవలం పూజ కోసమే కాకుండా ఈ పారిజాతం చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. ఈ చెట్టు గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని కొంచెం నీరు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని తలకు పెట్టడం వల్ల పుండ్లు, కురుపులు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ గింజల పౌడర్‌కు కొబ్బరి నూనె జోడించి తలకు పట్టించి గంట తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్య ఉండదు.
ఎక్కడపడితే అక్కడ పెంచకూడదు
పారిజాతం చెట్టు యొక్క ఆకులను పేస్ట్‌లా చేసి అందులో ఆముదం వేసి చిన్నమంటపై వేడి చేసి దాన్ని వాతం నొప్పులపై వేసి కట్టుకట్టుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఈ చెట్టు గింజలను ఒక మట్టి పాత్రలో వేసి నల్లగా మారేవరకు వేడి చేసుకోవాలి. ఆ తర్వాత పౌడర్ చేసి అందులో హారతి కర్పూరం పొడి, నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. దీన్ని రాసుకుంటే సుఖవ్యాధులైన గజ్జి, తామర తగ్గిపోతాయి. పారిజాతం చెట్టును పెంచడానికి కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఎక్కడపడితే అక్కడ పెంచకూడదని పెద్దలు చెబుతున్నారు. వీటి పూలను ఎవరూ తొక్కడానికి వీల్లేకుండా ప్రత్యేకంగా ఒక ప్లేస్‌ను ఎంచుకోవాలని అంటున్నారు. ఈ విధంగా పారిజాతం చెట్టు దేవతారాధనకు, ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది.