Black Carrot Health Tips: బ్లాక్ క్యారెట్ల వలన ఎన్నో ప్రయోజనాలు..ఇలా తింటే బెస్ట్ సాధారణంగా మార్కెట్‌లో ఎరుపు రంగు క్యారెట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే నలుపు రంగు క్యారెట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శీతాకాలంలో రక్తహీనత, రక్తంలో చక్కెర స్థాయి, గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. By Vijaya Nimma 09 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Black Carrot Health Tips: ప్రస్తుత కాలంలో కొన్ని పనులు వినడానికి, చూడడానికి కొంత వింతగానే అనిపిస్తాయి. నల్ల క్యారెట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా..? మనదేశంలో ఎక్కువగా పండకపోయినా ఇతర దేశాల్లో ఇలాంటి అధికంగా పండుతూ ఉంటాయి. అలాంటి వాటిలో నల్ల క్యారెట్స్ ఒకటి. మీలో ఎవరైనా నల్ల క్యారెట్స్‌ని ఎప్పుడైనా చూసారా..?. మార్కెట్లో సాధారణంగా దొరికే పండ్ల కంటే భిన్నంగా కొన్ని రకాల పండ్లు మనకి లభిస్తున్నాయి. క్యారెట్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. అవి ఎరుపు రంగులో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్యారెట్స్ నలుపు రంగులో ఉన్నాయి. ఈ క్యారెట్స్‌ను ఎప్పుడు వినే ఉండరు. ఇవి ఆహారంలో రోజూ తీసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా వీటిని ఎక్కువగా చలికాలంలో తింటే తీవ్రమైన వ్యాధులతోపాటు.. ఎన్నో రకాల రోగాలను మంచి ఉపశమనం దొరుకుతుందని వైద్యులు చెప్తున్నారు. ఈ నల్ల క్యారెట్లు తింటే కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: చలికాలంలో నెయ్యి తింటే ఏం అవుతుందో తెలుసా..? నల్ల క్యారెట్స్‌లో పొటాషియం, ఫైబర్, విటమిన్- సి, ఏ, బి, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. శీతాకాలంలో నల్ల క్యారెట్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఈ సీజన్లో ఆహారంలో ఈ క్యారెట్లను తీసుకుంటే ఎన్నో రకాల మేలులు మేలు జరుగుతుంది. గుండెకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయి. వీటిల్లో ఉండే ఆంథోసైనిన్ ఉందని అది గుండెకి ఎంతో మేలు చేసి దృఢంగా ఉంచేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బ్లాక్ క్యారెట్లు తింటే మధుమేహం తగ్గుతుంది బ్లాక్ క్యారెట్టు కళ్ళకి కూడా బాగా పనిచేస్తాయి. వీటిని రోజు తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. ఈ నల్ల క్యారెట్లు కళ్ళకి ఒక వరం అని కూడా చెప్పాలి. అదేవిధంగా శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణను మంచి జరిగేలా చూస్తుంది. రక్తహీనత రోగులు కూడా ఈ నల్ల క్యారెట్లని తింటే ఎటువంటి సమస్యలు రావని చెబుతున్నారు. ఇక రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఈ నల్ల క్యారెట్లు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బ్లాక్ క్యారెట్లు తింటే సమస్యలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-benefits #black-carrot మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి