Heavy Rains: రాజధాని నగరంతో పాటు మరో 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ!

మరి కొద్ది గంటల్లో జీ 20 సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఐఎండీ మరో కీలక ప్రకటన చేసింది. అది ఏంటంటే..దేశ రాజధాని నగరం ఢిల్లీతో పాటు మరో 19 రాష్ట్రాలను వరుణుడు వణికించనున్నాడంట

New Update
Heavy Rains: రాజధాని నగరంతో పాటు మరో 19 రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ!

గత కొన్ని రోజులుగా దేశంలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు కూడా ప్రకటించారు. మరి కొద్ది గంటల్లో జీ 20 సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఐఎండీ మరో కీలక ప్రకటన చేసింది. అది ఏంటంటే..దేశ రాజధాని నగరం ఢిల్లీతో పాటు మరో 19 రాష్ట్రాలను వరుణుడు వణికించనున్నాడంట.

మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ లలో కుండపోత వానలు పడే సూచనలున్నాయని ఆ రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అటు ఉత్తరాది రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్ లలో భారీ వర్షాలు పడతాయని ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశలున్నట్లు ఐఎండీ తెలిపింది.

గురువారం నాడు ముంబైలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయి విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. జీ 20 సమ్మిట్ కి వేదిక అయిన నగరం ఢిల్లీలో కూడా కుండపోత వానలు కురిసే అవకాశలున్నట్లు తెలుస్తుంది.

9,10 తారీఖుల్లో భారీగా వర్షాలు పడే అవకాశలున్నట్లు ఐఎండీ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్‌ 8-10 తేదీల మధ్య ఉష్ణోగ్రతలు 35-39 డిగ్రీల, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26-28 మధ్య ఉండే అవకాశాలున్నాయని చెప్పింది.

Advertisment
తాజా కథనాలు