/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-18-3.jpg)
ఖమ్మం జిల్లా చింతకాని దగ్గర రైలు సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి మరీ దోపీడీ చేసిందో ముఠా.పలువురు ప్రయాణికుల బంగారు ఆభరణాలు, నగదు, బ్యాగులు చోరీ చేశారు.ప్రతిఘటించిన ప్రయాణికులపై దాడిచేసేందుకు కూడా దొంగలు వెనుకాడలేదని చెబుతున్నారు. పద్మావతి, ధర్మవరం ఎక్స్ ప్రెస్, తిరుపతి స్పెషల్ ట్రైన్ లలో ఒకే తరహాలో దారి దోపిడీ జరిగింది. ఒకేరోజులోనే ఈ దొంగతనాలు జరగడం గమనార్హం.దీనిపై కేసు నమోదు చేసి రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.