అమెరికాకు చెందిన విక్టోరియా హిల్ అనే యువతి ఓ యువకుడిని కొన్నాళ్లుగా ప్రేమిస్తోంది. తర్వాత ఆ యువకుడితో పలుమార్లు సెక్స్‌లో పాల్గొంది. అకస్మాత్తుగా ఒక రోజు ఆ యువకుడు విక్టోరియా హిల్‌కు ఓ టెక్స్ట్ సందేశం పంపాడు. అతను పంపిన మెసేజ్‌లో.. ‘ఇద్దరి జన్యువులను పరీక్షించగా.. నువ్వు నా సోదరి అని తేలింది’ అని పేర్కొన్నాడు. అది చదివిన విక్టోరియా షాక్ గురయింది. ఈ విషయం పై ఓ డాక్టర్ ను సంప్రదించిన విక్టోరియా ఆ యువకుడు, ఆమె కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించారని తెలిపాడు. కానీ, ఈ విషయం ఇద్దరికీ మొదట్లో తెలియదు.
అయితే వారి తల్లులకు అదే వైద్యుడు చికిత్స అందించటం గమనార్హం. డాక్టర్ బార్టన్ గాడ్వెల్ సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేస్తారు. ఆ సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు తన స్పెర్మ్‌ను దానం చేశారని, రోగులందరికీ తన స్పెర్మ్‌ను అందించారని అతను పేర్కొన్నాడు. అంటే అతనే స్పెర్మ్ బ్యాంకుగా మారి పరోక్షంగా తన పేషెంట్లకు స్పెర్మ్ దానం చేశాడన్నమాట. అతను స్వయంగా విక్టోరియా తల్లికి, ఆమె ప్రియుడి తల్లికి శుక్రకణాన్ని దానం చేశాడు. దీంతో జన్యు పరీక్ష ద్వారా ఈ విషయం వెల్లడైంది.
షాక్ గురైన విక్టోరియా నా సోదరుడితో సంబంధంలో ఉన్నట్లు ఊహించలేనని చెప్పింది. ఎవరిని చూసినా అక్కా, తమ్ముడిలా భయం వేస్తోందని వేదనను పంచుకుంది. ఎందుకంటే డాక్టర్ బార్టన్ గాడ్వెల్ ఇప్పటివరకు 23 మంది పిల్లలకు తండ్రైన సంగతి తెలిసిందే. విక్టోరియా ఇప్పుడు వైద్యుడు పదవీ విరమణ చేసినందున అతనిపై దావా వేయవచ్చని భావించింది. కానీ U.S.లో సంతానోత్పత్తి మోసానికి వ్యతిరేకంగా స్పష్టమైన చట్టాలు లేనందున, తదుపరి ఏమి చేయాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆమె చెప్పారు.