/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-13T141336.043-jpg.webp)
హైదరాబాద్ లో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. తాగుడుకు బానిసైన భర్త వేధింపులు భరించలేక ఆ ఇళ్లాలు దారుణానికి పాల్పడింది. కళ్లముందే కట్టుకున్న స్త్రీ అనంతలోకాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతుంటే పెద్దగా పట్టించుకోని దుర్మార్గుడు సెల్ ఫోన్ లో వీడియో తీస్తూ నిలుచున్నాడు. చివరికి అతను కటకటాలపాలవగా ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోవడం స్థానికులను కలిచివేసింది.
ఇది కూడా చదవండి : AP Holidays 2023: కొత్త ఏడాది సెలవులు ప్రకటించిన జగన్ సర్కార్.. సంక్రాంతి సెలవుల డేట్స్ ఇవే!
ఈ మేరకు ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకోగా.. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ దంపతులకు ఐదేండ్ల క్రితం పెండ్లి అయింది. అయితే రసూల్‌కు అదివరకే ఒక పెళ్లైన విషయాని దాచి అర్షియాను కూడా వివాహం చేసుకున్నాడు. దీనికితోడు అతడికి మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో తాగొచ్చిన అర్షియా గొడవపడుతుండేవాడు. ఇరిద్దకి దాదాపు ప్రతిరోజు గొడవలు జరిగేవి. మానసికంగా కుంగిపోయిన అర్షియా సోమవారం రాత్రి భర్తను ప్రవర్తన మార్చుకోవాలంటూ నిలదీసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ వేధింపులు తట్టుకోలేనని, ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ ఆమె ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రసూల్.. ఆమెను మరింత రెచ్చగొడుతూ సెల్‌ఫోన్‌తో వీడియో తీయడం ప్రారంభించాడు. అన్నంత పని చేసిన అర్షియా తనవు చాలించింది. ఆమె తనను బెదిరిస్తున్నదని భావించి వీడియో తీశానని, నిజంగా చనిపోతుందని ఊహించలేదని భర్త పోలీసుల ముందు వాపోతున్నాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.