Weird Culture: అక్కడ సమాధిలోంచి శవాలను తీసి ముస్తాబు చేస్తారు! తర్వాత ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు..! ప్రతిదానిలో జీవాన్ని చూసే అక్కడి వ్యక్తులు.. ప్రతి వస్తువు సజీవంగా ఉంటుందని..సహజంగా ప్రతిదానికీ ఆత్మ ఉంటుందని వారు నమ్ముతారు. అక్కడి ప్రజలు సమాధిలోంచి శవాలను తీసి ముస్తాబు చేస్తారు. ఈ వింత ఆచారం ఎక్కడో చూసేయండి. By Durga Rao 22 Apr 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా మన భారతదేశంలో (India) దేవుడి పూజలు చేస్తారు. పర్వదినాల్లో దేవుడి పండుగలు నిర్వహిస్తారు. అందులో కూడా అనేక ఆచారాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రేత పూజలు కూడా చేస్తారు. ఇలాంటి ఆచారాలపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. అదేవిధంగా ఇండోనేషియా (Indonasia) లో కొన్ని ప్రాంతాల్లో అక్కడి ప్రజలు అనుసరించే ఆచారాల గురించి తెలిస్తే మనం షాక్ అవ్వాల్సిందే. అక్కడి ప్రజల ఆచారం ఏమిటంటే చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఖననం చేసే ముందు పంచభూతాల సాక్షిగా స్నానం చేయడం భారతదేశంలోని కొన్ని సంఘాల ఆచారం. కానీ ఇండోనేషియాలో మాత్రం చనిపోయిన వారిని సమాధిలోంచి బయటకు తీసి స్నానం చేసి పండుగలా జరుపుకునే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఈ వార్త చదివి మీరు షాక్ అవుతారు. కాని ఆ వేడుక ఇప్పటికి జరుగుతున్న మాట మాత్రం వాస్తవం. శవాలను శుభ్రం చేసి అలంకరిస్తారు..దక్షిణ ఇండోనేషియాలోని సులవేసిలో తోరాజా కమ్యూనిటీ ఓ విచిత్రమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. అది ఏమిటంటే చనిపోయిన వారు కూడా సజీవంగా అంటే ఇంకా జీవించే ఉన్నారని నమ్ముతారు. అందుకే వాళ్ల సంవత్సరికం రోజున పండుగ చేసుకుంటారు. ఈ ప్రత్యేక వేడుకను మనెనే అంటారు. ఆరోజున శవాలను సమాధుల్లోంచి బయటకు తీసి శుభ్రపరిచే పండుగ అని అర్థం. ఈపండుగకు మృతుడి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శవాన్ని గుంతలోంచి బయటకు తీసి స్నానం చేయిస్తారు. ఈ ఆచారం ప్రకారం చనిపోయిన వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతారు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆయనను చూసుకోవడానికి ఇక్కడి సమాజం ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తుంది. ప్రతి వస్తువు సజీవంగా ఉంటుందని తోరజా సమాజం నమ్ముతుంది. సహజంలోని ప్రతిదానికీ ఆత్మ ఉంటుంది. జీవులు, నిర్జీవులు అనే తేడా లేకుండా ప్రతిదానికీ జీవం ఉందని ఎప్పటి నుంచో నమ్ముతున్నారు ఇక్కడి ప్రజలు.మరణం అంతం కాదు. దేనికీ అంతం లేదు, నిరంతర జీవిస్తూనే ఉంటాయని భావిస్తున్నారు. చనిపోవడం అంటే టోరోజా ప్రజలు గాయపడినట్లు భావిస్తారు. దీని కోసం టోరోజా ప్రజలు దీనిని మకులా అని పిలుస్తారు. అంటే గాయపడిన వ్యక్తి అంటే చనిపోయినా వ్యక్తిని బతికి ఉన్నట్లే చూసుకుంటారు. వాళ్లను క్షతగాత్రులుగా భావిస్తారు. శవాన్ని పాడుచేయకుండా… ప్రతి సంవత్సరం ఆగష్టు నెలలో, టోరోజా ప్రజలు వసంత మాసం చివరిలో మనెనే పండుగను జరుపుకుంటారు. చనిపోయిన వారి మృతదేహాలను సమాధుల నుండి తీసివేసి ఎటువంటి గందరగోళం లేకుండా కలిసి శుభ్రం చేస్తారు. పురుగులు, ధూళి లేకుండా చాలా జాగ్రత్తగా శుభ్రం చేసిన తర్వాత, కొత్త బట్టలు వేసి, సమాధులను శుభ్రం చేస్తారు.నిర్జీవమైన శరీరాలను శుభ్రం చేసిన తర్వాత వాటిపై తమ ప్రేమ, గౌరవాన్ని ప్రదర్శిస్తారు. వాటిని అందంగా అలంకరిస్తారు. పురాతన ఆచారాలను అనుసరించడంతో పాటు టోరోజా ప్రజలు సంబంధాల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒకచోట చేరుకుంటారు. టోరోజా ప్రజల భిన్న శైలి.. టోరోజా ప్రజలు కొనసాగిస్తున్న ఈ ఆచారం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బంధుమిత్రుల గౌరవం, ప్రేమ, ఆదరణ తగ్గకుండా బతికుండగానే సంరక్షించుకోవడంతో వారు మరణించిన తర్వాత కూడా వారిని సంబరాలు చేసుకునే ఆచారాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. ఇది విచిత్రమైన సంప్రదాయ అయినప్పటికి టోరోజా ప్రజల మతపరమైన ఆచారం నిజంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. #indonesia #trending-news #international-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి