పళ్యాణ్ కళ్యాణ్ మూడో విడత వారాహి విజయ యాత్రం( Varahi Yatra) రేపు విశాఖపట్నంలో ప్రారంభంకానుంది. వారాహి యాత్ర విజయం కోసం సింహాద్రి అప్పన్న (Simhadri Appanna) కొండపైకి మోకాళ్ళతో మెట్లు ఎక్కిన జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు (గురువారం) ప్రారభమై.. ఈనెల 19 వరకు కొనసాగనుంది. అయితే వారాహి యాత్ర మూడో విడత విజయం సాధించాలని జనసైనికులు సింహాచలం తొలి పావంచ వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. మెట్లు మార్గం గుండా మోకాళ్ళతో పైకి ఎక్కి సింహాద్రి అప్పన్న స్వామివారి దర్శనం చేసుకున్నారు. విశాఖపట్నం యాత్ర దిగ్విజంగా సాగాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే 10 రోజుల పాటు విశాఖలో అనేక అంశాలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తావన చేయనున్నారు. వారాహి యాత్ర కోసం ఇప్పటికే పోలీసు శాఖ వారిని అన్ని అనుమతులు కోరినట్లు తెలుస్తోంది. రుషికొండ, ముదపాక, విస్సన్నపేట ప్రాంతాలను సందర్శించిన పవన్ కళ్యాణ్, స్టీల్ ప్లాంట్, గంగవరం, కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు.
కాగా పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్నారని తెలిసి వైసీపీ నాయకుల్లో దడ పట్టుకుంది. రేపటి నుండి యాత్ర మొదలవుతోంది. అయినా ఇంతవరకు కూడా రూట్ మ్యాప్ పోలీసులు ఇవ్వలేదు. ఎవరు ఎన్ని అడ్డంగా సృష్టించిన జనసేనాని వారాహి యాత్ర ఎవరు ఆపలేరని జనసేనుకులు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మూడో విడత వారాహి యాత్ర కోసం జనసేన కీలక నిర్ణయం తీసుకుంది. యాత్రను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కమిటీ సమన్వయకర్తగా మల్నీడి తిరుమరావును నియమించగా.. క్యాటరింగ్ కమిటీ సభ్యులుగా బండి రామకృష్ణ, మధు వీవరేశ్, కత్తిపూడి బాబీ, మోకా నాని, రావాడ నాగు, రామారావు, గర్భాన సత్తిబాబు, గల్లా తిమోతి, మేడిద దుర్గాప్రసాద్, పట్టాభిరామయ్య, మాగాపు వీర్రాజు, మోండా శివప్రసాద్‌లను నియమించింది.
ఇక.. విశాఖలో పవన్ వారాహి యాత్ర (Varahi Yatra) ను విజయవంతం చేయాలని జీవీఎంసీ చెత్త వాహనంతో ప్రచారం చేస్తున్నారు. జగదాంబ సమీపంలో ఉన్న 37వ వార్డులో ఒక పక్క చెత్త సేకరిస్తూ మరో పక్క పవన్ సభను జయప్రదం చేయాలని ఓ డ్రైవర్ విజ్ఞప్తి చేస్తున్నారు. జీవీఎంసీ వాహనంలో జనసేన ప్రచారం చూసి విశాఖ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే..రేపు సాయంత్రం 5 గంటలకు విశాఖలోని జగదాంబ కూడలిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. అనంతరం జానవాణి కార్యక్రమం, క్షేత్రస్తాయి పర్యటన కూడా ఉంటుందని పేర్కొన్నారు. గంగవరం పోర్టు, తదితర ప్రాంతాలలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని.. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 9 రోజులపాటు ఈ వారాహియాత్ర సాగుతోందని జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిన శివశంకర్ వెల్లడించారు.