Crime News : దారుణం.. ప్రిన్సిపాల్‌ను కత్తితో కిరాతకంగా హత్య చేసిన విద్యార్థి..!

అస్సాం శివసాగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్‌ రాజేష్‌ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

New Update
Crime News: ఏలూరు జిల్లాలో దారుణం.. పిల్లనిచ్చిన మామను అల్లుడు ఏం చేశాడంటే..

Student Brutally Killed Principal : ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ఏకంగా ప్రిన్సిపాల్‌ను హత్య (Kill) చేశాడు ఓ విద్యార్థి. ఈ దారుణమైన ఘటన అస్సాం (Assam) శివసాగర్ లో చోటుచేసుకుంది. ఒంగోలు (Ongole) కి చెందిన ప్రైవేట్ కళాశాల ప్రిన్సిపాల్ బెజవాడ రాజేష్..ఓ విద్యార్థిని ప్రవర్తన మార్చుకోమని మందలించాడు. అయితే, తన ప్రవర్తనపై ప్రిన్సిపాల్ అలా చెప్పడం విద్యార్థికి నచ్చలేదు.

Also Read: డయేరియా కలకలం.. ఇద్దరు మానసిక దివ్యాంగులు మృతి..!

తీవ్ర ఆగ్రహానికి లోనై ప్రిన్సిపాల్‌ (Principal) రాజేష్‌పై కత్తితో కిరాతకంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తానే చంపానని ఆన్లైన్ ద్వారా విద్యార్థి తెలిపాడు. జరిగిన సంఘటనతో ఒక్కసారిగా తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోకసంద్రంలో ఉన్నారు.  మృతుడు రాజేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు