Station Ghnapur Mla Rajayya:ప్రచారంతో దుమ్ము రేపుతున్న సీట్ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే...ఎవరి కోసమో?

ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్ధులు ప్రచారం చేయడం చాలా మామూలు. దీని కోసం వినూత్న కార్యక్రమాలు...వింత వింత చేష్టలు కూడా చేస్తారు. కానీ అసలు టికెట్టే రాని అభ్యర్థులుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే...జనగామలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య ప్రచారం సంథింగ్ స్పెషల్ గా నిలుస్తోంది.

Station Ghnapur Mla Rajayya:ప్రచారంతో దుమ్ము రేపుతున్న సీట్ కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యే...ఎవరి కోసమో?
New Update

రాజయ్య ప్రచార కార్యక్రమాలు జనంలో చర్చగా మారాయి. ఫుల్ జోష్ తో ఊగిపోతున్న రాజయ్య జనంతో మమేకమవుతూ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.డప్పు దరివేసి తెగ హడావుడి చేస్తున్న రాజయ్య మహిళలతో కలిసి కోలాటాలు చేస్తూ వాహ్ అని కార్యకర్తల చేత కేక పెట్టిస్తున్నారు.ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ కు ఓటేయండి అని జనానికి విజ్ఞప్తి చేస్తూ వినూత్న రీతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజయ్య సంథింగ్ స్పెషల్ గా నిలుస్తున్నారు..

Also Read:టీమ్ ఇండియాకు షాక్..మెగాటోర్నీ నుంచి హార్దిక్ పాండ్యా అవుట్

అయితే ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు హుసారుగా ప్రచారం చేసారంటే ఒక అర్ధం ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ల కేటాయింపు లో గులాబీ బాస్ కేసీఆర్ రాజయ్యకు మొండి చేయిచూపారు. సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు కేటాయించక పోతే ఎవరైనా అలిగి కూర్చుంటారు.. ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉటారు. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఉన్నారు రాజయ్య. టికెట్ రాకపోయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా రెట్టింపు ఉత్సాహంతో రాజయ్య ప్రచార కార్యక్రమాలలో పాలగొంటున్నారు. ఇందులో ఆయన డాన్సులు హైలెట్ గా నిలుస్తున్నాయి. కానీ అంతకంటే హైలెట్ అవుతున్నది మాత్రం పోటీలో లేకపోయినా ప్రచారం చేస్తున్నారనే విషయం.

జనగామ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం రాజయ్య విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ని గెలిపించాలని జనగామలో ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న రాజయ్య వెరైటీ కార్యక్రమాలతో జనాలను ఆకట్టుకుంటున్నారు. నలుగురు డప్పు కళాకారులు కనిపిస్తే చాలు పరుగున అక్కడికి వెళ్లి డప్పు గుంజుకుని దరువేస్తున్నారు. మహిళలు కోలాటంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి స్వాగతం పలుకుతుంటే ఆయన కూడా ఎదురెళ్లి వారితో కలిసి కోలాటాలు చేస్తున్నారు.

ప్రస్తుతానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో మాత్రం రాజయ్యే హాట్ టాపిక్ గా ఉన్నారు. ఈయన గురించి అక్కడి రాజకీయ పార్టీలన్నీ చర్చించుకుంటఉన్నాయి. ప్రజలలో కూడా రాజయ్య ప్రత్యేక చర్చగా మారారు.

Also read:సెంటిమెంట్ కంటిన్యూస్…కోనాయిపల్లి గుడికి సీఎం కేసీఆర్

#rajayya #warangal #sitting-mla #brs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe