Uttar Pradesh: లంచంగా ఐదు కేజీల బంగాళాదుంపలు.. ఎస్సై సస్పెన్షన్.. ట్విస్ట్ ఏమిటంటే..

కన్నౌజ్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై ఓ రైతు కేసును సెటిల్‌ చేసేందుకు ఆయన వద్ద నుంచి బంగాళదుంపల్ని లంచంగా డిమాండ్‌ చేశాడు.ఈ విషయాన్ని రైతు ఫోన్‌ కాల్‌ రికార్డు చేయడంతో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.దీంతో ఆ ఎస్సైని అధికారులు సస్పెండ్ చేశారు.

Uttar Pradesh: లంచంగా ఐదు కేజీల బంగాళాదుంపలు.. ఎస్సై సస్పెన్షన్.. ట్విస్ట్ ఏమిటంటే..
New Update

UP: యూపీలోని కన్నౌజ్‌ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై తనకి లంచంగా ఓ రైతు వద్ద నుంచి బంగాళదుంపలు అడిగాడు. ఈ విషయం ఉన్నతాధికారుల వద్దకు చేరడంతో అతని పై వేటు పడింది. అయితే ఓ కేసు సెటిల్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అతడు... ‘బంగాళదుంప’ అనే దానిని కోడ్‌ పదంగా ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

రామ్ కృపాల్ సింగ్ అనే ఎస్సై ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఎస్సై రైతుతో మాట్లాడిన కాల్‌ ని రికార్డు చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రస్తుతం ఎస్సై ఆడియో జిల్లా వ్యాప్తంగా వైరల్‌గా మారింది. కన్నౌజ్ జిల్లా సౌరిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భావల్‌పూర్ చౌకీలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై ఈ నిర్వాకానికి పాల్పడినట్లు గుర్తించిన కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆ ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారని అధికారులు ప్రకటించారు.

Also Read: ఆదానీ కంపెనీల్లో సెబీ ఛైర్ పర్శన్‌కు వాటాలు-హిండెన్‌బర్గ్ రిపోర్ట్

ఈ ఘటనలో సదరు ఎస్సై పై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. కన్నౌజ్ సిటీ సర్కిల్ అధికారి కమలేశ్ కుమార్‌కు కేసు దర్యాప్తు బాధ్యతలను ఇచ్చారు. కాగా వైరల్ ఆడియోలో ఆ ఎస్సై బాధిత రైతుని 5 కిలోల ‘బంగాళాదుంపలు’ అడగగా.. తాను అన్ని కిలోలు ఇచ్చుకోలేనని రైతు సమాధానం ఇచ్చాడు.

దీంతో ఆగ్రహానికి గురైన ఎస్సై తన ఉద్దేశాన్ని అర్థమయ్యేలా చెప్పాడు. ఆ రైతు 2 కిలోలు ఇస్తానని అన్నాడు. పోలీసు అధికారి కోపంతో తన అసలు డిమాండ్‌ను నొక్కి చెప్పాడు. దీంతో ఫైనల్‌గా 3 కిలోలు తీసుకునేందుకు ఎస్సై ఒప్పుకున్నాడు.

#uttar-pradesh #latest-news-in-telugu #bribe #si #potatoes
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe