Vinesh Phogat Appeal Rejected By Court : భారత స్వాతంత్ర దినోత్సవానికి (Independence Day) ఒక రోజు ముందు వినేష్ ఫోగట్ (Vinesh Phogat) చేసిన విజ్ఞప్తిని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS) తిరస్కరించింది. CAS తీసుకున్న ఈ నిర్ణయంతో భారత అభిమానుల ఆశలు నీరుగారిపోయాయి. 3 గంటల విచారణ.. చాలా చర్చల తర్వాత, సుప్రీం కోర్ట్ ఆఫ్ స్పోర్ట్స్ UWR (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్), ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) స్టాండ్‌ను అంగీకరించింది. ఫలితంగా స్వర్ణం కోల్పోవడమే కాకుండా రజత పతకాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, వినేష్ ఫోగట్ ఇంత పెద్ద మ్యాచ్‌కు కేవలం 100 గ్రాముల తగ్గింపు ఎందుకు పొందలేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
అవకాశం పొందకపోవడానికి 2 పెద్ద కారణాలు..
అంతకుముందు రెజ్లింగ్‌లో వివిధ వెయిట్ కేటగిరీల బౌట్‌లన్నీ ఒకే రోజు జరిగేవి. ఆ సమయంలో రెజ్లర్లు బరువును మెయింటైన్ చేయడంలో ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. 2017లో అందులో పెద్ద మార్పు తీసుకువచ్చారు. UWW, అతిపెద్ద రెజ్లింగ్ సంస్థ, ఒలింపిక్స్ - ప్రపంచ ఛాంపియన్‌షిప్ వంటి పెద్ద ఈవెంట్‌లను రెండు రోజుల్లో నిర్వహించాలని నిర్ణయించింది. అప్పటి నుండి రెజ్లర్లు బరువు నిర్వహణ సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభించారు. వీక్షకుల ద్వారా - అనేక ఇతర మాధ్యమాల ద్వారా డబ్బు సంపాదించడం ఈ నియమాన్ని తీసుకురావడం వెనుక ఒక ప్రధాన కారణం. వినేష్ ఫోగట్ కేసు తర్వాత UWW ప్రెసిడెంట్ నెనాద్ లాలోవిచ్ రూల్స్ కు అనుకూలంగా తన వాదనలు వినిపించారు. దీని ప్రకారం, లాలోవిచ్, భారత రెజ్లర్ పట్ల తన సానుభూతిని తెలియజేస్తూ, 100 గ్రాముల మినహాయింపు ఇవ్వడం పెద్ద విషయం కాదని చెప్పాడు. అలాఅని వినేష్ అభ్యర్ధన అంగీకరిస్తే తరువాత 200 గ్రాముల తగ్గింపు కోసం అప్పీల్స్ వస్తాయి. ఇలా మినహాయింపులు కోరడానికి అంతు ఉండదు. అంతేకాకుండా, ఇలా ఆమెకు మినహాయింపు ఇవ్వడం వలన.. ఇతర రెజ్లర్లకు అన్యాయం అవుతుంది.
ఇక అతను చెప్పిన రెండవ కారణం ఏమిటంటే, చాలా మంది రెజ్లర్లు తమ కేటగిరీని వదిలి పెట్టి ఇతర వెయిట్ కేటగిరీలలో ఆడటానికి ఇష్టపడుతున్నారు. దీని కోసం, వారు చాలా బరువు తగ్గాల్సి వస్తోంది. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇప్పటి రెజ్లర్లు ప్రస్తుత ఈవెంట్‌ను మాత్రమే చూస్తున్నారని, రాబోయే 20-30 సంవత్సరాలు కాదని లాలోవిచ్ అన్నారు. రెజ్లర్లు వారి సహజ బరువు విభాగంలో ఆడాలని సంస్థ కోరుకుంటుంది. తద్వారా వారి ఆరోగ్యం ప్రభావితం కాదు. ఇది కాకుండా, రియల్ విభాగంలో ఆడటం అత్యుత్తమ ప్రదర్శనను తెస్తుంది. UWW చేసిన ఈ వాదనలు CASలో వినేష్ అభ్యర్ధనను వీగిపోయేలా చేశాయని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
వినేష్ విషయంలో ఏమి జరిగింది..
2024 పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024) లో మహిళల 50 కిలోల బరువు విభాగంలో వినేష్ ఫోగట్ పాల్గొని ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ ఉదయం వెయిటింగ్‌లో ఆమె బరువు నిర్దేశించిన పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. UWW నిబంధనల ప్రకారం, ఎవరైనా రెజ్లర్ తన కేటగిరీ కంటే అధిక బరువు ఉన్నట్లు గుర్తించినట్లయితే, అతను మొత్తం టోర్నమెంట్ నుండి అనర్హుడవుతాడు. ఇది మాత్రమే కాదు, అతని బౌట్‌లు చెల్లవు. ఆ ఆటగాడిని చివరి స్థానంలో ఉంచుతారు. ఒకవేళ ఆటగాడు గెలిచే పరిస్థితిలో ఉన్నప్పటికీ పతకం ఇవ్వరు. వినేష్ విషయంలో కూడా అదే జరిగింది. వినేష్ ఇంతకు ముందు 53 కేజీల విభాగంలో ఆడేది. ఈసారి 50 కేజీల విభాగంలో పోటీపడింది. దీనికోసం ఆమె బరువు తగ్గడానికి ప్రాణాల మీదకు తెచ్చుకునేలా పోరాటం చేసింది.
Also Read : కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.. కోర్టులో పిటిషన్!