Nampally Fire Accident: ఫైర్‌ యాక్సిడెంట్‌ జరగడానికి ఫైవ్‌ రీజన్స్‌ ఇవే!

ఈరోజు ఉదయం నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి కీలక విషయాలను అగ్నిమాపక శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలను వివరించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
Nampally Fire Accident: ఫైర్‌ యాక్సిడెంట్‌ జరగడానికి ఫైవ్‌ రీజన్స్‌ ఇవే!

ఇద్దరు చిన్నారులు సహా తొమ్మిది మందిని బలి తీసుకున్న నాంపల్లి రెడ్​హిల్స్​అగ్నిప్రమాదానికి భవన యజమాని రమేశ్ ​జైస్వాల్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ తేల్చింది. పార్కింగ్​కోసం కట్టిన స్టిల్ట్​ఫ్లోర్​తో పాటు...సెట్​బ్యాక్​ ప్రాంతాల్లో కూడా తేలికగా మండే స్వభావమున్న రసాయనాల డ్రమ్ములు ఇతర వస్తువులను నిల్వ చేయటమే ఇంతటి విషాదానికి దారి తీసిందని నిర్ధారించింది. భవనం నుంచి బయటకు రావటానికి కేవలం మెట్ల మార్గం మాత్రమే ఉండటం... అగ్నిప్రమాదం సంభవించగానే ఆ మార్గం అంతా దట్టమైన పొగ అలుముకోవటంతో లోపల ఉన్నవారు బయటకు రాలేక ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపింది. ఇక, ప్రమాదానికి బల్దియా నిర్లక్ష్యం కూడా కారణమని స్పష్టమవుతోంది. ఆ ప్రాంతంలో జీ ప్లస్​2 అంతస్తుల భవనాలు నిర్మించటానికి మాత్రమే అనుమతులు ఉండగా రమేశ్​ జైస్వాల్​జీ ప్లస్​4 అంతస్తులు...ఆపై పెంట్​హౌస్​కట్టినా చర్యలు తీసుకోవటంలో మున్సిపల్​ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించిన రమేశ్ ​జైస్వాల్​అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీ కూడా తీసుకోకపోవటం.

ALSO READ:సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే?

నాంపల్లి రెడ్​హిల్స్​ ప్రాంతంలో రమేశ్​ జైస్వాల్​ అనే వ్యాపారికి చెందిన బాలాజీ రెసిడెన్సీ ఉంది. ఉదయం 9.30గంటల సమయంలో భవనం స్టిల్ట్​ఫ్లోర్​లో మంటలు చెలరేగగా వెంటనే స్థానికులు ఫైర్​ కంట్రోల్​రూంకు ఫోన్ ​చేశారు. దాంతోపాటు మంటలను అదుపు చేయటానికి ప్రయత్నించారు. అయితే, స్టిల్ట్​ఫ్లోర్​లో రసాయన పదార్థాలతో నిండి ఉన్న డ్రమ్ములు, తేలికగా మండే స్వభావం ఉన్న వస్తువులు ఉండటంతో క్షణాల్లోనే విస్తరించిన మంటలు భవనం నాలుగో అంతస్తు వరకు చేరుకున్నాయి. కాగా, కంట్రోల్​రూంకు ఫోన్​రాగానే గౌలిగూడ చమన్, జూబ్లీహిల్స్, సాలార్​జంగ్​మ్యూజియం, సెక్రటేరియట్, యాఖుత్​పురా ఫైర్​స్టేషన్ల నుంచి ఫైరింజన్లు, మల్టీపర్పస్​ టెండర్​ వాహనాలు, సైమన్ ​స్నార్కెల్, బ్రోంటో స్కై లిఫ్ట్​వాహనం అక్కడకు హుటాహుటిన చేరుకున్నాయి. అప్పటికే మంటలు పై అంతస్తులకు ఎగబాకాయి. దాంతో భవనం మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. పరిస్థితిని గమనించిన అగ్నిమాపక సిబ్బంది ఒకవైపు మంటలు ఆర్పటానికి ప్రయత్నిస్తూనే మరోవైపు బ్రోంటో స్కైలిఫ్ట్ వాహనం, మెట్ల మార్గం​ద్వారా భవనం లోపలి చిక్కుకున్న వారిలో 21మందిని బయటకు తీసుకువచ్చారు. వీరిలో నలుగురికి తీవ్రంగా గాయాలు కాగా మిగితా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

ALSO READ: జానారెడ్డితో పాటు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్స్ రిజెక్ట్!

నగరంలోని పలు చోట్ల ఇలాగే రసాయనాల డ్రమ్ములు, తేలికగా మండే స్వభావం ఉన్న వస్తువులను సెల్లార్లు, స్టిల్ట్​ఫ్లోర్లలో నిల్వ చేస్తున్నట్ట తమ దృష్టికి వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇలా ఎక్కడ కనిపించినా వెంటనే ఫైర్, పోలీస్, బల్దియా శాఖలకు సమాచారం అందించాలని కోరారు. ఇక, భవన యజమానులు తప్పనిసరిగా తమ తమ భవనాల్లో ఫైర్​ఫైటింగ్​సిస్టంను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాణిజ్య కాంప్లెక్సులు, పెద్ద ఎత్తున వ్యాపారం చేసే ఇతర సంస్థలు సెక్యూరిటీని పెట్టుకున్నట్టుగా ఫైర్​ఫైటింగ్​ఆఫీసర్లను నియమించుకోవాలన్నారు. ఒక్క మెట్ల మార్గమే కాకుండా ఏదైనా ప్రమాదం జరిగినపుడు బయట పడటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించాలన్నారు. ఇక, భవన సెట్​బ్యాక్​ప్రాంతాలను ఖాళీగా ఉంచాలని సూచించారు. అప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజన్లు లోపలికి వెళ్లి మంటలు ఆర్పటానికి సులువుగా ఉంటుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 101 నెంబర్​కు ఫోన్​చేసి సమాచారం అందించాలని కోరారు.

అగ్నిప్రమాద మృతుల వివరాలు :

రెండవ అంతస్తు :
(1) మహ్మద్ ఆజమ్, 54
(2) మహ్మద్ హసీబుర్ రెహమాన్ ,
(3) రెహానా సుల్తానా , 50
(4) తహూరా ఫర్హీన్, BDS doctor , 38
(5) తూభ, 5
( 6 ) తరూబా, 12(తహూరా ఫర్హీన్ ఇద్దరు పిల్లలు )

(7) ఫైజా సమీన్ , 25 అవివాహిత
(8) నికత్ సుల్తానా, 50 సంవత్సరాలు
(9)జకీర్ హుససేన్ 66 సంవత్సరాలు

Bds డాక్టర్ తహూర ఫర్జీన్ ఈ బిల్డింగ్ లో నివాసం వుండరు..

సెలవులు వుండడంతో పిల్లలతో పాటు బంధువుల ఇంటికి వచ్చింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు