/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-19T174300.018-jpg.webp)
Ice Cream Made With Urine In Warangal: ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం కలిపి విక్రయించిన ఘటన సంచలనం రేపుతోంది. ఎండాకాలం ఎఫెక్ట్ తో చిన్న పెద్ద తేడా లేకుండా లొట్టలేసుకుంటూ మింగేసే ఐస్ క్రీమ్ కు డిమాండ్ పెరగడంతో నకిలీ మాల్ దందా జోరుగా సాగుతోంది.
దారుణం..ఐస్ క్రీంలో వీర్యం కలుపుతున్నాడు
వరంగల్ - నెక్కొండలో రోడ్డుపై ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తి దానిలో వీర్యం కలుపుతున్నాడు. pic.twitter.com/BYJkYZ496H
— Telugu Scribe (@TeluguScribe) March 19, 2024
ఇటీవలే యాసిడ్, మురికి నీరుతో చేసిన ఐస్, తీపి కోసం వాడే పదార్థాల్లో నాణ్యత లోపించడం వంటి సంఘటనలు ఎన్నో బయటపడగా తాజాగా మరో దారుణమైన, వింటేనే వాంతి చేసుకునే హేయమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం..
ఈ మేరకు వరంగల్ జిల్లలోని నెక్కొండ ప్రాంతంలో జోరుగా బాలాజీ కంపెనీ పేరుతో ఐస్ క్రీమ్ దందా సాగుతోంది. అయితే వారు ఊరురా తిరిగి విక్రయించే ఫలుదా ఐస్ క్రీమ్ లో మూత్రం, వీర్యం కలుపుతున్నట్లు సమాచారం అందడంతో ఐస్ క్రీం తయారీ కేంద్రంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇందులో పలు అనుమానాలు ఉండటంతో ఐస్ క్రీమ్ విక్రేతలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే యజమానులతోపాటో గలీజ్ పనులకు పాల్పడిన కొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి: AP: సీఎం జగన్ కు చిత్తశుద్ధి లేదు.. బుద్ధి చెబుతాం: మందకృష్ణ
ఇక ఐస్ క్రీమ్ కంపెనీలో నిల్వ ఉంచిన ఫ్రూట్ సలాడ్ లను పరిశీలించి అధికారులు పారబోశారు. రోడ్ల వెంట బండిపై ఫలుదా ఐస్ క్రీం అమ్ముతూ వ్యాపారం చేస్తున్న వారితోపాటు రోడ్ సైడ్ ఫుడ్ షాప్ యజమానులకు పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి పదార్థానికి సంబంధించి పరిశుభ్రత పాటించాలని, లేని యెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.