వాటర్ హీటర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నమహిళ అరెస్ట్!

కేరళలోని అలువా రైల్వే స్టేషన్‌లో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్‌ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 50 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.ఆమె కు ఆ డ్రగ్స్ ను ఎక్కడి నుంచి వచ్చాయనే దాని పై పోలీసులు విచారణ చేపట్టారు.

వాటర్ హీటర్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నమహిళ అరెస్ట్!
New Update

చాలా మందికి రైలులో ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదో తెలియకపోవచ్చు. అయితే, భారతీయ రైల్వే ఈ విషయంలో ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూనే ఉంది. అయితే రైలులో వాటర్ హీటర్ తో వచ్చిన 26 ఏళ్ల యువతిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కేరళలో ఇటీవలి కాలంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలు ఎక్కువయ్యాయి. ఈ డ్రగ్స్ ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల నుంచి కేరళకు అక్రమంగా రవాణా అవుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు బయటి రాష్ట్రాల నుంచి కేరళకు వచ్చే రైళ్లు, బస్సులతోపాటు వాహనాలను పోలీసులు తరచూ తనిఖీలు చేస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ నుంచి అలువా వెళ్లే రైలులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఎర్నాకులం పోలీసులకు సమాచారం అందింది.

అలువాకు వచ్చినపోలీసులు రైలులో సోదాలు నిర్వహించగా 26 ఏళ్ల యువతి వద్ద 50 లక్షల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదటగానే ఆమె గురించి సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమెను  బ్యాగ్‌ ను సోదా చేయగా వాటర్ హీటర్‌ ఉన్నట్టు గుర్తించారు. వాటర్‌ హీటర్‌పై అనుమానం వచ్చిన పోలీసులు.. లోపల ఉండాల్సిన ఎలక్ట్రికల్‌ కాంపోనెంట్స్‌కు బదులు పైపుల్లో ప్యాక్‌ చేసి ఉంచిన ఎండీఎంఏ డ్రగ్ ను గుర్తించారు.రూ.50 లక్షల విలువైన కిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చెపట్టారు. విచారణలో నైజీరియాకు చెందిన ఓ వ్యక్తి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సమ్రీన్ అక్తర్  తెలిపింది.

#abduction-case #woman #kerala
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe