Shashi Kumar: ఐటీ కంపెనీలో ఉద్యోగం మానేసిన వ్యక్తి నేడు రూ.260 కోట్ల కంపెనీకి చైర్మన్!

అక్షయకల్ప ఆర్గానిక్ వ్వస్థాపకుడు శశికుమార్ విప్రో లాంటి ఐటీ కంపెనీలో భారీ జీతభత్యంతో 13 ఏళ్లు ఉద్యోగబాధ్యతలు నిర్వరించారు.కానీ 2010లో ఉద్యోగానికి రాజీనామా చేసి సొంత వ్యాపారం వైపు మొగ్గు చూపిన అతను కంపెనీని రూ.260 కోట్లకు ఎలా తీసుకువెళ్లారో ఇప్పడు తెలుసుకుందాం.

New Update
Shashi Kumar: ఐటీ కంపెనీలో ఉద్యోగం మానేసిన వ్యక్తి నేడు రూ.260 కోట్ల కంపెనీకి చైర్మన్!

CEO of Akshayakalpa Organic: జీవితంలో చాలా మంది  వ్యక్తులను వారి సక్సస్ ఫుల్ స్టోరీలను ఉదాహరణలుగా చూపవచ్చు.అలాంటి కోవలోకి వచ్చేవారిలో ఒకరైన వారే  అక్షయకల్ప సీఈవో శశికుమార్. ఈ  వెంచర్‌ను ప్రారంభించడానికి ముందు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రోలో (Wipro) శశికుమార్ ఉద్యోగిగా పనిచేశారు. 13 ఏళ్లకు పైగా ఈ కంపెనీలో పనిచేసిన శశికుమార్ (Shashi Kumar) ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా వ్యాపారం ప్రారంభించిన ధైర్యాన్ని మనం అభినందించాలి.

అక్షయకల్ప ఆర్గానిక్ అనేది భారతదేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతో శశి కుమార్ ప్రారంభించిన సంస్థ. బెంగళూరులో 2010లో స్థాపించబడిన ఈ కంపెనీ ఎలాంటి యాంటీబయాటిక్స్, కృత్రిమ పదార్థాలు, హార్మోన్లు లేదా రసాయన పురుగుమందులు ఉపయోగించకుండా పాలు మరియు పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది.

వ్యవసాయ కుటుంబానికి చెందిన శశికుమార్ సేంద్రియ, రసాయన రహిత ఉత్పత్తులకు అధిక డిమాండ్‌ను గుర్తించి కంపెనీని ప్రారంభించారు. విప్రోలో పనిచేస్తున్నప్పుడు, వ్యవసాయంలో విపరీతమైన సమస్య ఉందని కుమార్ గ్రహించాడు. తన తండ్రిలాగే చాలా మంది రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించాలని కుమార్ నిర్ణయించుకున్నాడు.

Also Read: దేశవ్యాప్తంగా 157 యూనివర్సిటీల్లో లోపాలు.. యూజీసీ సంచలన ప్రకటన

రైతులు తమ ఉత్పత్తులకు మంచి రాబడిని పొందాలని బాగా తెలిసిన కుమార్, వారి ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకెళ్లడానికి లింక్‌ను రూపొందించారు. కుమార్ ఈ ప్రాజెక్ట్ కోసం పాలను లాభదాయకమైన ఉత్పత్తిగా ఎంచుకున్నాడు. తమ కంపెనీ రైతుల నుంచి పాలను కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేస్తుంది.

అక్షయకల్ప ఆర్గానిక్ భారతదేశంలో ఆర్గానిక్ సర్టిఫికేట్ పొందిన మొదటి ఆర్గానిక్ డైరీ కంపెనీ. ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన పాలను అందించేందుకు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రోజు ప్రజలు అక్షయకల్ప యొక్క విశిష్ట పనితీరును అభినందిస్తున్నారు.

అక్షయకల్ప ఆర్గానిక్‌కు 600 ఫామ్‌లలో పది వేల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. తమ కంపెనీలో 400 మందికి పైగా నైపుణ్యం కలిగిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై మరియు పూణే వంటి మెట్రో నగరాల్లో నివసించే ప్రజలు తమ ఆర్గానిక్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. FY 2023లో కంపెనీ వార్షిక ఆదాయం రూ.260 కోట్లు.

Advertisment
తాజా కథనాలు