Brazil Floods : బ్రెజిల్ ప్రజలు వరదలతో అల్లాడుపోతున్నారు. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. దాదాపు వెయ్యి మందికిపైగా మృతి చెందారు. 2 లక్షల మందికిపైగా నిరాశ్రయులు అయ్యారు. మంచినీరు, ఆహారం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల లోంచి జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విద్యుత్ సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రజలు చీకట్లోనే మగ్గుతున్నారు. వరదలకు రోడ్లు, బ్రిడ్జిలు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. విమాన ప్రయాణాలు ఇంకా మొదలుకానట్లు తెలుస్తోంది.
Also Read: ఉగ్రవాదం పై అమిత్ షా జీరో టెర్రర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?