/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-12T161841.093-jpg.webp)
Mahua Moitra to Vacate Govt Bungalow: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ (Congress MP) మహువా మొయిత్రాకు మర్ బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. కాగా ఢిల్లీలో తనకోసం ప్రభుత్వం కేటాయించిన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని సూచించాలంటూ మంత్రిత్వ శాఖను పార్లమెంట్ హౌసింగ్ కమిటీ ఆదేశించింది.
ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) 30 రోజుల్లోగా తన బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించాలంటూ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హౌసింగ్ కమిటీ లేఖ రాసింది. పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడిన విషయం తెలిసిందే. కాగా ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన ఢిల్లీలోని అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని హౌసింగ్ కమిటీ కోరింది. ఎథిక్స్ కమిటీ (Ethics Committee) నివేదికను లోక సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న టీఎంసీ ఎంపీ బహిష్కరణకు గురయ్యారు. ఓ వ్యాపారవేత్త నుంచి ఆమె బహుమతులు స్వీకరించడం, అక్రమంగా లబ్ది పొందడం పార్లమెంటరీ ప్రవర్తనను ఉల్లంఘించడమేనని నివేదికలో పేర్కొంది. బీజేపీకి చెందిన నిషికాంత్ దూబే ఫిర్యాదు మేరకు ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి మొయిత్రా అనైతికంగా ప్రవర్తించారని ఆరోపించింది. లోక్ సభ వెబ్ సైట్ లాగిన్ వివరాలను అనధికార వ్యక్తులతో పంచుకున్నారని కమిటీ నివేదిక నొక్కి చెప్పింది.
Also Read : వచ్చే ఏడాది మొత్తం 27 సెలవులు.. లిస్ట్ విడుదల చేసిన తెలంగాణ సర్కార్!
అయితే ఈ వివాదం జాతీయ భద్రతా చిక్కుల గురించి ఆందోళనలను లేవనెత్తింది. వ్యాపారవేత్త ప్రోద్బలంతోనే పార్లమెంటులో అదానీ గ్రూప్ ను (Adani Group), ప్రధాని నరేంద్ర మోడీని (PM Modi) లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు లేవనెత్తినందుకు బదులుగా మొయిత్రా బహుమతులు స్వీకరించారని దూబే (Nishikant Dubey) ఆరోపించారు. కాగా.. తన బహిష్కరణపై స్పందించిన మొయిత్రా.. లోక్ సభ నిర్ణయం నిర్ణయం చట్టవిరుద్ధమని అన్నారు. పార్లమెంటరీ ప్యానెల్ చర్యలను ఖండిస్తూ ఆమె సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కమిటీని అస్త్రంగా వాడుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమని ఆమె విమర్శించారు. బహిష్కరణను కంగారూ కోర్టులో విచారణతో పోలుస్తూ, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటరీ సంస్థలను ప్రభుత్వం వాడుకుంటోందని తన బహిరంగ ప్రకటనల్లో ఆరోపించారు మొయిత్రా.