Ayodhya : పాత విగ్రహం కూడా కొత్త దానితో పాటూ గర్భగుడిలోనే ఉంటుంది-క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్ అయోధ్య కొత్త ఆలయంలోకి కొత్త శ్రీరాముడు విచ్చేయనున్నాడు. పాత విగ్రహం స్థానంలో కొత్త రామ్ లల్లాను ప్రాణ ప్రతిష్టచేయనున్నారు. కానీ పాత విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. రెండూ కలిపే గర్భుగుడిలో పూజలందుకోబోతున్నాయి. By Manogna alamuru 22 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Sri Rama Idol : ఈరోజు అయోధ్య(Ayodhya) లో రామ్ లల్లా(Ram Lalla) విగ్రహ ప్రాణ ప్రతిష్టను అంగరంగ వైభవంగా చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశిష్ట అతిధులు ఆల్రెడీ వచ్చేశారు. అయితే అయోధ్య రామాలయం(Ramalayam) కొత్తదేమీ కాదు. దాన్ని ఇప్పుడు రీ మోడల్ చేశారు అంతే. అంతకు ముందే అక్కడ రామాలయం ఉండేది. రాముల విగ్రహం కూడా ఉండేది. మరి ఇప్పుడు కొత్త విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తే పాత విగ్రహాన్ని ఏం చేస్తారు అనేది అందరికీ డౌట్‌గానే ఉండిపోయింది. ఆ అనుమానాన్ని కూడా తీర్చేస్తున్నారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. Also Read : అయోధ్య ఆలయ గోపురం ఎత్తు ఎంతో తెలుసా? పాత విగ్రహం కూడా గర్భగుడిలోనే... అరుణ్ రాజ్‌యోగ్ అనే శిల్పి తయారు చేసిన రామ్ లల్లా విగ్రహాన్ని జనవరి 22న ప్రధాని మోడీ చేతుల ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. అంతకు ముందు అయోధ్యలో సీతా సమేత శ్రీరామచంద్రుని విగ్రహం ఉండేది. వారితో పాటూ లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఉండేవారు. ఇప్పుడు ఆ విగ్రహాలను ఏం చేస్తారు అని అడిగితే...వాటిని ఏమీ చేయము. అవి ఇక్కడే ఉంటాయి. కొత్త విగ్రహాలతో పాటూ పాత వాటిని కూడా గర్భగుడిలోనే ఉంచి పేజలు చేస్తాము అని చెబుతున్నారు శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్. 121 మంది పండితులు.. ఇక జనవరి 16 నుంచి ప్రాణ ప్రతిష్ట(Prana Pratishtha) కు ముందు జరగాల్సిన క్రతువులు మొదలవనున్నాయి.ఈ నెల 21 వరకు అవి కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో 121 మంది పండితులు పాల్గొంటారని చంపత్ రాయ్ తెలిపారు. వీటన్నిటినీ ట్రస్ట్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుందని చెప్పారు. ప్రధాన ఆచారి గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ వీటన్నింటినీ పర్యవేక్షిస్తారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆలయాల అలంకరణ... ఇక ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత ఒకరి తరువాత ఒకరికి దర్శనమయ్యేలా, అందరూ ప్రశాంతంగా రాముల వారిని దర్శించుకునేట్టు ఏర్పాట్లు చేస్తామని కమిటీ నిర్వాహకులు చెబుతున్నారు. తోపులాటలు, తొందరగా వెళ్ళిపొమ్మనడాలు ఉండవని చెబుతున్నారు. ఇక ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నింటిలో ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక భజనలు, హారతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. Also Read : Ayodhya : వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య రామాయణం #ayodhya #ram-mandir #ram-lalla-idol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి