AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11.27 గంటలకు కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయనతోపాటు కూటమి నుంచి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చంద్రబాబు కేబినెట్‌లో స్థానం దక్కించుకునేదెవరనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఓ చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 20 నుంచి 21 మంది ఎమ్మెల్యేలకు మంత్రిగిరి దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. ఇప్పటికే ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే నారా లోకేశ్ అండ్ టీమ్ ఇప్పటికే 50 మంది పేర్లతో జాబితాను గత రాత్రే సిద్దం చేసినట్లు సమాచారం.
టీడీపీ:
కాపు:
జ్యోతుల నెహ్రు
నారాయణ
కన్నా లక్ష్మీనారాయణ
నిమ్మల రామానాయుడు
బోండా ఉమ
కమ్మ:
చంద్రబాబు
లోకేష్
గొట్టిపాటి రవి
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
పయ్యావుల కేశవ్
బీసీ:
పల్లా శ్రీనివాస్
కొల్లు రవీంద్ర
అనగాని సత్యప్రసాద్
కూన రవికుమార్
కళా వెంకట్రావు
సుధాకర్ యాదవ్
సబితమ్మ
రెడ్డి:
మాధవీ రెడ్డి
రాంగోపాల్ రెడ్డి
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
ఆనం రామనారాయణ రెడ్డి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
బీసీ జనార్ధన్ రెడ్డి
ఓసీ:
రఘురామకృష్ణంరాజు
శ్రీరామ్ తాతయ్య
టీజీ భరత్
ఎస్సీ, ఎస్టీ:
బాల వీరాంజనేయులు
అనిత
అయితాబత్తుల ఆనందరావు
నక్కా ఆనంద్‌బాబు
గుమ్మడి సంధ్యారాణి
జనసేన:
పవన్ కల్యాణ్
నాదెండ్ల మనోహర్
కొణతాల రామకృష్ణ
దేవ వరప్రసాద్
బీజేపీ:
సత్యకుమార్
సుజనాచౌదరి