/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T185555.549-jpg.webp)
The Kerala Story OTT Release: సుదీప్తో సేన్ (Sudipto Sen) దర్శకత్వంలో ఆదాశర్మ (Adah Sharma) ప్రధాన పాత్రలో నటించిన హిందీ డ్రామా ఫిలిం ‘ది కేరళ స్టోరీ’. గతేడాది మే 5న విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటు సినిమా, రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. మత పరమైన అంశాలతో కూడిన ఈ సినిమా .. అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వివాదాస్పదంగా మారింది. కొన్ని రాష్ట్రాలు అయితే ఏకంగా ఈ సినిమానే బ్యాన్ చేశాయి. ఇక గతేడాది హాట్ టాపిక్ గా మారిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా.. అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మొత్తానికి రిలీజైన తొమ్మిది నెలల తరువాత ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.
‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ రిలీజ్
View this post on Instagram
‘ది కేరళ స్టోరీ’ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 (Zee5) దక్కించుకుంది. ఫిబ్రవరి 16 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి జీ5 సంస్థ ఓ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) ఓటీటీ రిలీజ్ ఎప్పుడని ఎంతో మంది ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలను చూపిస్తూ.. "ద వెయిట్ ఈజ్ ఓవర్ " అంటూ రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ఇక థియేటర్స్ లో సూపర్ హిట్ రెస్పాన్స్ పొందిన ఈ సినిమా ఓటీటీలో ఎలా అలరించబోతుందో చూడాలి. విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిమాహ్‌గా యోగితా, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని, దేవదర్శిని, ప్రణాలి ఘోగారే కీలక పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన నలుగురు యువతులను మతం మార్చి .. ఐసిస్ లాంటి ప్రమాదకర ఉగ్రవాద సంస్థల్లో ఎలా జాయిన్ చేశారో అనేదే ఈ సినిమా కథాంశం.
Follow Us