Investors : ఇన్వెస్టర్లు అధిక ఈక్విటీ అమ్మకాలను ఎదుర్కోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్(Stock Market) ఈరోజు (గురువారం) తీవ్రంగా దెబ్బతింది. బీఎస్ఈ(BSE) సెన్సెక్స్ 1130 పాయింట్లు పతనమై 72,334.18 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ(Nifty) 50 ఇండెక్స్ కూడా ఏప్రిల్ 19 తర్వాత తొలిసారిగా 370 పాయింట్లు పడిపోయి 22,000 దిగువకు చేరింది.సెన్సెక్స్ 1062.22 పాయింట్లు (1.45%) తగ్గి 72,404.17 వద్ద, నిఫ్టీ 50 345 పాయింట్లు (1.55%) 21,957.50 వద్ద ముగిశాయి. భారతదేశ అస్థిరత సూచిక, ఇండియా విక్స్ ఇండెక్స్, 6.5% పెరిగి 18.20కి చేరుకుంది. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ రూ.400 లక్షల కోట్ల దిగువకు పడిపోయి రూ.393.73 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.
2024 సాధారణ ఎన్నికల(General Elections) మూడు దశలు ముగియడంతో, ముందస్తు ఎన్నికల ఉత్కంఠ తగ్గి మార్కెట్ అనిశ్చితి నెలకొంది. HDFC బ్యాంక్ ,లార్సెన్ & డుబ్రో (L&T) వంటి మేజర్‌ల షేర్ల ధరలు క్షీణించడం, నేటి స్టాక్ మార్కెట్ క్షీణతకు దోహదపడింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు నిర్ణయం, యుఎస్‌లో ఉద్యోగ నష్టాల గణాంకాలపై డేటా దేశ స్టాక్ మార్కెట్‌ను తిరోగమనంలోకి నెట్టడమే కాకుండా ప్రపంచ స్టాక్ మార్కెట్లను ప్రతికూల ధోరణిలోకి పంపింది.
యూరోపియన్ Stoxx 600 సూచిక నాలుగు రోజుల గరిష్ట స్థాయి తర్వాత కొద్దిగా తగ్గింది. అయితే S&P 500 సూచిక ప్రారంభ వాల్ స్ట్రీట్ ట్రేడింగ్‌లో తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. మే 8న ఎఫ్‌ఐఐలు రూ.2854 కోట్ల విలువైన భారతీయ స్టాక్‌లను విక్రయించారు. దీంతో మార్చిలో విక్రయాల ట్రెండ్ ఏప్రిల్‌లోనూ కొనసాగుతోంది. దాదాపు వారం రోజుల్లో ఎఫ్‌బీఐలు రూ.5,076 కోట్ల షేర్లను విక్రయించాయి. ఏప్రిల్ 16-30 మధ్యకాలంలో దాదాపు రూ.27,410 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లో గట్టి సరఫరా మధ్య యుఎస్ క్రూడ్ ఇన్వెంటరీలు తగ్గుముఖం పట్టడంతో గురువారం ప్రారంభ ట్రేడ్‌లో చమురు ధరలు పెరిగాయి.
Also Read : బీజేపీ ఎంపీకి బిగ్ షాక్..