Hyderabad : రెండో రోజు కొనసాగుతున్న గణనాథుని నిమజ్జనాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాలు నిమజ్జనం అయినట్లు సమాచారం.

author-image
By Bhavana
New Update
Ganesh Immersion: గణనాథుడి నిమజ్జనానికి సర్వం సిద్ధం.. హుస్సేన్ సాగర్‌లో ఏర్పాట్లు ఇవే..

Ganesh Immerssion : గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ మార్గ్‌ లో గణేష్‌ విగ్రహాలు భారీగా చేరుతున్నాయి.హుస్సేన్‌సాగర్‌ దగ్గరకు వినాయక విగ్రహాలు వేలాదిగా వస్తున్నాయి. గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Also Read :  ఏపీ కేబినెట్ భేటీ.. మరో రెండు పథకాలకు గ్రీన్ సిగ్నల్!

Greater Hyderabad

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీ మార్గ్‌ లో గణేష్‌ విగ్రహాలు భారీగా చేరుతున్నాయి.
హుస్సేన్‌సాగర్‌ దగ్గరకు వినాయక విగ్రహాలు వేలాదిగా వస్తున్నాయి. గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా.. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం తరువాత నిమజ్జన ప్రక్రియను అధికారులు వేగవంతంగా ముగించారు. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లోపై నిమజ్జనం కోసం గణపతులు క్యూ కట్టాయి. 

Also Read :  ఇవాళ ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశం

నిమజ్జనం పూర్తి కావడానికి సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రి ఒంటిగంటకు చార్మినార్‌లో వినాయక నిమజ్జన శోభయాత్ర ముగిసింది. పాతబస్తీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభయాత్ర ప్రశాంతంగా జరిగింది.ఇప్పటి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 1,02,500 విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాలు , ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్‌ వద్ద 4,730 విగ్రహాలు , నెక్లెస్ రోడ్ 2,360 విగ్రహాలు , పీపుల్స్ ప్లాజా వద్ద 5230 విగ్రహాలు , హైదరాబాద్ (Hyderabad) అల్వాల్ కొత్తచెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు అధికారులు తెలిపారు.

గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రానికి నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read :  Lunar Eclipse : చంద్రగ్రహణం.. గర్భిణులు ఇళ్ల నుంచి బయటకు రావద్దు!
Advertisment
తాజా కథనాలు