గురుకులాల్లో వసతులపై స్పందించిన కోర్టు.. చర్యలు తప్పవంటూ హెచ్చరిక రాష్ట్రంలో 9వేలకు పైగా వసతిగృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవంటూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. వసతులపై నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. By srinivas 18 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్టల్స్, రెసిడెన్సియల్ స్కూల్స్ లో వసతులు సరిగా లేవంటూ దాఖలైన ఫిటిషన్ పై హైకోర్టు స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొంభై శాతం గురుకుల పాఠశాలల్లో కనీస వసతులు లేవని, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందంటూ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి : పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 9 వేలకు పైగా వసతిగృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవని, ప్రభుత్వం కనీస అవరాలు కల్పించడం లేదని చిక్కుడు ప్రభాకర్ వాదించారు. అలాగే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ చట్టం మార్గదర్శకాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభాకర్ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్రంలోని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో వసతులపై నిపుణులతో కమిటీని నియమిస్తామని హైకోర్టు వెల్లడించింది. వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో అందించాలని నిపుణుల కమిటీని ఆదేశిస్తామని పేర్కొంది. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, రెండు వారాల తర్వాత తదుపరి విచారణను చేపడతామని స్పష్టం చేసింది. #high-court #facilities #responded #residential-schools మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి