Telangana High Court: రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు..?.. ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు

ఆ రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు?.. అంటువ్యాధులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..?.. మృతులకు ఎంత నష్ట పరిహారం చెల్లించారు..? అని బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండో సారి నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు అందజేసింది. దీంతో ధాఖలైన పిల్‌ను విచారించిన హైకోర్టు సమగ్ర నివేదికను కోరింది.

New Update
Telangana High Court: రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారు..?.. ప్రభుత్వాన్ని నివేదిక కోరిన హైకోర్టు

Telangana High Court : రాష్ట్రంలో వర్షాలు, వరదలపై దాఖలైన పిల్‌పై హైకోర్టులో విచారణ చెపట్టింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండో సారి నివేదికను హైకోర్టుకి ప్రభుత్వం అందజేసింది. వరదలపై ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై విచారణ చేసిన న్యాయస్థానం.. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు రిపోర్ట్‌లో ప్రభుత్వం పేర్కొంది. 500 కోట్ల రూపాయలు పునరావాసం కోసం కేటాయించినట్లు రిపోర్ట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. రెండో సారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను కోర్టుకి న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ సమర్పించారు.

ఎవరెవరికి ఎంత ఖర్చు..?

అయితే 500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని హైకోర్టు అన్నది. రూ.500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అంటువ్యాధులతో భాద పడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో..? కూడా నివేదికలో తెలపాలని స్పష్టం చేసింది. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో తదుపరి విచారణ వచ్చే గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు.

అతలాకుతలం చేసిన వరదలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వానలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో కురిసిన వానలకు పంట నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరిగింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పలు సహాయక చర్యలు నిర్వహించి.. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎడతెపిరి లేకుండా కురిసి వర్షాలకు.. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రోడ్లపై భారీగా వరద చేరడం, వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం రాకూండా ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది. ఇక రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వానలు, వరదలపై హైకోర్టులో పిటిషన్‌ వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.

Also Read: వైన్ షాపులకు ఒక్క రోజే 3140 దరఖాస్తులు..ఖజానాకు 1400 కోట్లు!

Advertisment
తాజా కథనాలు