MLC: గవర్నర్ (Governer) కోటా ఎమ్మెల్సీల పిటిషన్‌పై హైకోర్టు (HIgh court) నేడు విచారణ జరిపింది. బీఆర్‌ఎస్ గవర్నమెంట్ దాసోజు శ్రవణ్ కుమార్, కుర్ర సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సిఫారసు చేస్తూ గవర్నర్‌కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఆ ప్రతిపాదనలను గవర్నర్ తిరస్కరించారు. అయితే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండ రామ్, అమీర్ అలీఖాన్‌లను నామినేట్ చేయగా గవర్నర్ ఆమోదించారు.
గవర్నర్ పరిధికి మించి..
ఈ క్రమంలో ఎమ్మెల్సీల నియామకాన్ని గవర్నర్ రిజెక్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు పిటిషన్ వేశారు. గవర్నర్ పరిధికి మించి వ్యవహరించి మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని తిరస్కరించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని, దాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ లేదని వాదించారు.
ఇది కూడా చదవండి : Telangana: దారుణం.. ORR వద్ద వైద్య విద్యార్థిని అనుమానస్పద మృతి..
ఈ నెల 14న మరోసారి..
పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా దీనిపై హైకోర్టులో సోమవారం వాదనలు కొనసాగాయి. కోదండరాం, అమీర్ అలీఖాన్ వాదనలు వినిపించగా.. హైకోర్టు విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అయితే వీరిని ప్రతివాదులుగా చేర్చడంతో వాళ్ల తరఫు న్యాయవాదుల వాదనలు ముగిశాయి. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ తరఫు న్యాయవాదులు మరోసారి పిటిషన్లపై వాదించనున్నారు.