కోడి కత్తి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా!

కోడి కత్తి కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 23 కి వాయిదా వేసింది. ఆరోజేనే తమ వాదనలు వినిపిస్తామని నిందితుడు శ్రీను తరుఫున న్యాయవాది సలీం పేర్కొన్నారు.

New Update
కోడి కత్తి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా!

జగన్‌ పై కోడికత్తి దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ బెయిల్‌ పిటిషన్‌ ను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఎన్‌ఐఏ , శ్రీనివాస్‌ తరుఫు న్యాయవాదులు సమయం కావాలని కోరడంతో విచారణను వాయిదా వేసిన హైకోర్టు. కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీను బెయిల్‌ పిటిషన్‌ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

శ్రీను తరుఫున వాదనలు వినిపించడానికి సిద్దంగా ఉన్నట్లు అతని తరుఫు లాయర్‌ సలీం తెలిపారు. కానీ మా వాదనలు వినడానికి సిద్ధంగా లేమని ఎన్‌ఐఏ వెల్లడించింది. 23 వ తేదీన మరోసారి వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇప్పటికే కేసులో 80 శాతం విచారణ పూర్తయ్యింది. జగన్‌ వచ్చి కోర్టులో వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. కానీ జగన్‌ ఒక సంవత్సరం నుంచి కోర్టుకు రావడం లేదు. పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఈ కేసును జగన్‌ సాగదీస్తున్నారని ఆయన ఆరోపించారు. వీడియో లింకు ద్వారా తనను విచారించమని జగన్‌ కోరుతున్నట్లు లాయర్ తెలిపారు.

జగన్‌ వేసే పిటిషన్ల వల్లే ప్రొసీడింగ్స్‌ లేట్‌ అవుతున్నాయని లాయర్‌ పేర్కొన్నారు. శ్రీను కుటుంబం పనికి ఆహార పథకం కింద బతుకుతుందని తెలిపారు. ఐదు సంవత్సరాల నుంచి శ్రీను జైల్లోనే మగ్గుతున్నాడని లాయర్‌ తెలిపారు. .

Also read: చిన్నమ్మా పురందేశ్వరీ..జాతీయ నేత నుంచి జాతి నేతగా ఎందుకు మారారు? : విజయసాయి రెడ్డి!

Advertisment
Advertisment
తాజా కథనాలు