Hyderabad: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పది మంది వీఐపీల హస్తం!

గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ గలీజ్ దందాలో పది మంది వీఐపీల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు వ్యాపారవేత్తలు, గజ్జెల వివేకానంద్ అబ్బాస్, కేదార్ తో పాటు సందీప్, ఇద్దరు అమ్మాయిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

New Update
Hyderabad: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పది మంది వీఐపీల హస్తం!

Radisson Hotel Drugs Case: గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ గలీజ్ దందాలో పది మంది వీఐపీల హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలువురు వ్యాపారవేత్తలు, గజ్జెల వివేకానంద్ అబ్బాస్ (Vivekananda), కేదార్ తో పాటు సందీప్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

కొకైన్ పేపర్ రోల్ లో చుట్టి..
అలాగే డ్రగ్స్ పార్టీలో మరికొంతమంది ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. కొకైన్ పేపర్ రోల్ లో చుట్టి డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీ శ్వేతతోపాటు లిశిపై కేసు బుక్ చేశారు. మరికొందరు అమ్మాయిలతో పాటు తొమ్మిది మందిపై కేసులు పెట్టినట్లు పోలీసులు చెప్పారు. రాడిసన్ హోటల్‌ (Radisson Hotel)లో సదరు యువకులు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారని, వారిలో ఒక ప్రముఖ బీజేపీ నేత యోగానంద్ (BJP Leader Yoganand ) కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ పార్టీలో డ్రగ్స్, మద్యం ఏరులై పారినట్టు తెలుస్తుండగా మరిన్ని కీలక విషయాలు రాబట్టేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఈ పార్టీకి హాజరైన వారంతా మత్తు పదార్థాలు, కొకైన్ స్వీకరించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు మరికొంతమంది హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఇక పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేసినట్లు తెలిపారు.

Also Read: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్‌ కీలక నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు