Cyber Fraud: ఓ మహిళను వీడియో కాల్ లో వివస్త్రను చేసిన సైబర్ దుండగులు!

Cyber Fraud: ఓ మహిళను వీడియో కాల్ లో వివస్త్రను చేసిన సైబర్ దుండగులు!
New Update

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగుల ఆర్థిక మోసాలకు హద్దులు లేకుండా పోయాయి. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న మహిళకు సైబర్ దుండగులు సీబీఐ,ముంబైఅధికారి నంటూ కాల్ చేసి మీ పైన డ్రగ్స్ కేసు నమోదైందని నమ్మించి ఆమెను వీడి టెస్ట్ పేరుతో వీడియో కాల్‌లో 36 గంటల్లో వివస్త్రను చేసి ఆ పై ఆమెను  డబ్బులివ్వాలని బెదిరించారు. అలాగే ఆమెను బట్టలు లేకుండా రికార్డ్ చేసి  క్లిప్పింగ్‌లను డార్క్ వెబ్‌లో విక్రయిస్తామని ఆమెను సైబర్ దుండగులు బెదిరించారు.

ఇలా బ్లాక్ మెయిల్ చేసి..
ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 2.15 గంటల నుంచి ఏప్రిల్ 5వ తేదీ తెల్లవారుజామున 1.15 గంటల వరకు మోసగాళ్లు మారథాన్ కాల్ చేస్తూ తన నుంచి రూ.15 లక్షలు దోపిడీ చేశారని 29 ఏళ్ల భువి (పేరు మార్చాం) పోలీసులకు తెలిపారు. ఫెడెక్స్‌కి చెందిన వ్యక్తి అని చెప్పుకుంటూ ఎవరో తనకు ఫోన్ చేశారని ఆ మహిళ చెప్పింది. అతని పేరు మీద థాయ్‌లాండ్‌కు పంపిన పార్శిల్‌లో 140 గ్రాముల ఎండిఎం ఉందని చెప్పాడు. ఆ తర్వాత మరికొద్ది సేపటికి ముంబై పోలీసు అధికారి నంటూ మరొకరు కాల్ చేశారని..మీరు డ్రగ్స్ విక్రయదారులతో సంబంధాలు ఉన్నాయని ముంబై పోలీసు అధికారి తెలిపారని వీడియో టెస్ట్ కు రావాలని ఆయన చెప్పారని అమె తెలిపింది.ఆ తర్వాత మిమ్మల్ని టెస్ట్ చేయాలి మీ బట్టలను తీయండి అని చెప్పారని..దేనికి అని అడిగితే చెప్పింది చేయాలని వారు సూచించారని ఆమె తెలిపింది.

ఆ తర్వాత మరొక అధికారి వీడియో కాల్ లోకి వచ్చి తన పేరు అభిషేక్ చౌహాన్ అని తను సీబీఐ అధికారినని చెప్పారన్నారు. తన మీద మానవ అక్రమ రవాణాకు, డ్రగ్స్‌కు తన ఆధార్‌ నంబర్‌ను అనుసంధానం చేసి ఉందని  తన బ్యాంక్‌ నుంచి వేరొకరి ఖాతాకు మనీలాండరింగ్‌ కూడా జరిగిందని ఆరోపించారన్నారు. ఆతర్వాత మీరు మా కాల్ లోనే ఉండాలని మిమ్మల్ని విచారిస్తున్న సమయంలో మీరు నిద్రపోయేటప్పుడు  తన కెమెరాను ఆన్ చేసి ఉండాలని చెప్పారన్నారు. ఏప్రిల్ 4న, చౌహాన్ తన లావాదేవీలను ధృవీకరించడానికి తన డబ్బు మొత్తాన్ని అతని ఖాతాకు బదిలీ చేయాలని ఆమెకు చెప్పాడు. సమీపంలోని బ్యాంకుకు వెళ్లి రూ.10.7 లక్షలను ఖాతాకు బదిలీ చేయాలని కోరారు. అప్పుడు అతను తన ఇంటికి తాళం వేసి తదుపరి సూచనల కోసం వేచి ఉండమని చెప్పాడని. ఆ తర్వాత అతని క్రెడిట్ కార్డును ఉపయోగించి సుమారు రూ.4 లక్షల విలువైన రెండు లావాదేవీలు జరిపారని ఆమె చెప్పారు.

#bangalore #fraud #cyber-fraud
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe