Triple Talaq : వాట్సప్ లో త్రిపుల్ తలాక్.. భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన భార్య!

ఆదిలాబాద్ జిల్లాలో తొలి ట్రిపుల్ తలాక్ కేసు నమోదైంది. కేఆర్‌కే కాలనీకి చెందిన జాస్మీన్‌ తన భర్త అబ్దుల్‌ అతిక్‌తో గొడవల వల్ల దూరంగా ఉంటుంది. పోషణ ఖర్చులు చెల్లించకుండా టార్చర్ చేసిన అతిక్.. ప్రశ్నిస్తే వాట్సప్ లో త్రిపుల్ తలాక్ చెప్పాడంటూ కేసు పెట్టింది.

New Update
Triple Talaq : వాట్సప్ లో త్రిపుల్ తలాక్.. భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన భార్య!

Big Shock For Husband : ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) లో తొలి ట్రిపుల్ తలాక్ (Triple Talaq) కేసు నమోదైంది. గతేడాది క్రితం నుంచి భార్యభర్తల మధ్య గొడవలు (Wife & Husband Fight) నడుస్తుండగా భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన వ్యక్తిపై మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు ఇన్ స్పెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు.. ఆదిలాబాద్ లోని కేఆర్‌కే కాలనీకి చెందిన జాస్మీన్‌, అబ్దుల్‌ అతిక్‌లకు 2017లో పెళ్లైంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2023 ఫిబ్రవరిలో అబ్దుల్‌ అతీక్‌ వేధిస్తున్నాడంటూ జాస్మీన్ కేసు పెట్టింది. దీంతో ఇరువురు దూరంగా ఉంటుండగా పోషణ కోసం కోర్టును ఆశ్రయించింది జాస్మిన్. ఈ క్రమంలో నెలకు రూ.7 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోని అతీక్‌.. నాలుగు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా, ఫోన్ లిప్ట్ ఎత్తకుండా టార్చర్ పెడుతున్నాడని బాధితురాలు వాపోయింది. మళ్లీ కేసు పెడతానని చెప్పడంతో ట్రిపుల్ తలాక్ ఇస్తున్నట్లు ఈ నెల 11న వాట్సాప్ లో మెసేజ్ పంపాడు. నీకు నాకు సంబంధం లేదన్నాడంటూ బాధితురాలు మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. దీంతో అతిక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే.. 2019లో ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయం తీసుకుంది. 3:2 మెజారిటీతో ముస్లింలలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు తీసుకునే ఆచారం చెల్లదని, చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్ ప్రాథమిక సిద్ధాంతాలకు కూడా విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Also Read : ఛీ..నువ్వేం తల్లివి.. మహిళ ప్రాణం తీసిన ట్రోలింగ్‌..!!

Advertisment
తాజా కథనాలు