Bullet Train: దేశంలోనే మొదటి బుల్లెట్ ట్రైన్ అక్కడి నుంచే...ఈ ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే..!!

ముంబై, అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ఎల్ అండ్ టీ ఆర్డర్ ను దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేరకు 508కిలోమీటర్ల మేర ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఎల్ అండ్ టీ వెల్లడించింది.

New Update
Bullet Train Project: లక్కీ ఛాన్స్..  ఆ కంపెనీకే బుల్లెట్ రైలు ప్రాజెక్ట్..

Bullet Train: దేశంలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసేందుకు ఎల్ అండ్ టీ ఆర్డర్ (L&T order)ను గెలుచుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎల్ అండ్ టీ కస్ట్రక్షన్ 508 కిలీమీటర్ల పరిధిలో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా ముంబై, అహ్మదాబాద్ (Mumbai, Ahmedabad)హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రూట్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత, ఈ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్ (Electrification system)వల్ల రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఈ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (International Co Operation Agency)నిధులు సమకూర్చుతున్నట్లు కంపెనీ తెలిపింది.

మహారాష్ట్రలో భూసేకరణ: 

ఈ ప్రాజెక్టుకు మహారాష్ట్రలో భూసేకరణ దాదాపు పూర్తి అయ్యిందని ఈ మధ్యే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో ఉన్న 8 నదులపై వంతెనల నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.

మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు:

దేశంలోనే ఈ మొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17కిలోమీటర్లు. 251కిలోమీటర్ల మేర పిల్లర్లు, 103 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి తెలిపారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మాదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, వాపి, థానే, వడోదర, అహ్మదాబాద్, ఆనంద్ లను కలుపుతుంది.

ఇది కూడా చదవండి:  వామ్మో ఇది మాముల వైరస్‌ కాదు.. సోకితే చావే.. అసలు చైనా ఏం చేస్తోంది?

Advertisment
తాజా కథనాలు