TSPSC: అదనపు పోస్టులతో ఫిబ్రవరిలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌?.. సిలబస్‌ ఇదే

టీఎస్‌పీఎస్సీలో తాజా పరిణామాలు ఉద్యోగార్థుల్లో మళ్లీ ఆశలు చిగురింపజేస్తున్నాయి. కాంగ్రెస్‌ జాబ్‌క్యాలెండర్‌ ప్రకారం ఫిబ్రవరిలో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. అదనపు పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేస్తారన్న ప్రచారం సాగుతోంది.

New Update
TSPSC: అదనపు పోస్టులతో ఫిబ్రవరిలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌?.. సిలబస్‌ ఇదే

TSPSC: తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం సమీపిస్తోంది. టీఎస్‌పీఎస్సీలో తాజా పరిణామాలు ఉద్యోగార్థుల్లో మళ్లీ ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ జాబ్‌క్యాలెండర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దానిప్రకారం ఫిబ్రవరి 1న గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉంది. మరోవైపు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ సహా బోర్డు నియామకంతో పాటు ఇతర ఏర్పా్ట్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా, గ్రూప్‌ 1లో మరిన్ని పోస్టులు కలిపి పెద్దసంఖ్యలో ఉద్యోగాలతో అనుబంధ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. అలా అయితే, కొత్తవారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. 503 పోస్టులతో గత నోటిఫికేషన్‌ జారీ చేయగా, దాదాపు మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, పేపర్‌ లీకేజీ వల్ల ఒకసారి రద్దవగా, నిర్వహణ లోపాల కారణంగా హైకోర్టు మరోసారి రద్దు చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. మరోవైపు అనుబంధ నోటిఫికేషన్‌ దిశగా ప్రభుత్వం ఆలోచనలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Free Current: వచ్చే నెల నుంచి ఫ్రీ కరెంట్.. మంత్రి కీలక ప్రకటన

నోటిఫికేషన్‌ వెలువడితే ఇప్పటికిప్పుడు ప్రిపేర్‌ కావడం మొదలు పెట్టినా స్వల్పకాలంలో పరీక్షకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావచ్చంటున్నారు పోటీపరీక్షల నిపుణులు. సిలబస్‌ను జాగ్రత్తగా గమనించి, ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్‌ అయితే, ఈ టీఎస్‌పీఎస్సీ పరీక్షలు మంచి అవకాశమని చెప్పొచ్చు. రెండు దశల్లో జరగనున్న టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 సిలబస్‌ కు సంబంధించి మార్పుల విషయమై టీఎస్పీఎస్సీ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. గత నోటిఫికేషన్ ప్రకారం సిలబస్ ఈ విధంగా ఉంది:

ప్రిలిమ్స్‌ & మెయిన్స్‌:
రెండు దశల్లో గ్రూప్‌-1 ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. మొదట ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. అయితే, ఇది అర్హత పరీక్ష. ఈ స్క్రీనింగ్‌ పరీక్షలో క్వాలిఫై అయితేనే మెయిన్స్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. అంతర్జాతీయ సంబంధాలు, వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం, ప్రపంచ-భారతదేశ&తెలంగాణ భౌగోళిక శాస్త్రం, విపత్తు నిర్వహణ, భారతదేశ&తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి వంటి జనరల్‌ స్టడీస్‌ అంశాలతో పాటు మెంటల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ అంశాలు ఇందులో ఉంటాయి. మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.

మెయిన్స్‌ పరీక్ష సిలబస్‌ కింది విధంగా ఉంటుంది:
పేపర్‌ -1: సాధారణ వ్యాసం (జనరల్‌ ఎస్సే) 150 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ప్రధానంగా ఈ అంశాలుంటాయి.
- సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు
- ఆర్థిక అభివృద్ధి, న్యాయపరమైన అంశాలు
- భారత రాజకీయ స్థితిగతులు
- భారతీయ చరిత్ర సాంస్కృతిక వారసత్వం
- సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి
- విద్య, మానవ వనరుల అభివృద్ధి

పేపర్‌ -2: చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం 150 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ప్రధానంగా ఈ అంశాలుంటాయి.
- భారత దేశ చరిత్ర, సంస్కృతి. ఆధునిక యుగం(1757–1947)
- తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
- భారతదేశం, తెలంగాణ జాగ్రఫీ

పేపర్‌-3: భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన 150 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ప్రధానంగా ఈ అంశాలుంటాయి.
- భారతీయ సమాజం, నిర్మాణం, అంశాలు, సామాజిక ఉద్యమాలు
- భారత రాజ్యాంగం
- పరిపాలన

పేపర్‌- 4: ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి 150 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ప్రధానంగా ఈ అంశాలుంటాయి.
- భారత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
- అభివృద్ధి, పర్యావరణ సమస్యలు

పేపర్‌- 5: సైన్స్‌, టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 150 మార్కులకు ఉంటాయి. వ్యవధి 3 గంటలు. ప్రధానంగా ఈ అంశాలుంటాయి.
- శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ప్రభావం
- విజ్ఞానశాస్త్ర వినియోగంలో ఆధునిక పోకడలు
- డేటా ఇంటర్‌ప్రిటేషన్‌– సమస్యా పరిష్కారం

పేపర్‌- 6: తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 150 మార్కులకు ఉంటుంది. వ్యవధి 3 గంటలు. ప్రధానంగా ఈ అంశాలుంటాయి.
- తెలంగాణ తొలి దశ (1948–1970)
- ఉద్యమ దశ (1971–1990)
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991–2014)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు