TS Teacher Jobs : 5,089 ఉద్యోగాలపై కీలక అప్డేట్.. నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త!

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి ఆన్‎లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది.  రేపటి (అక్టోబర్ 21)తో ఆన్‎లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఈనేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరికొన్నిరోజులు పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన విద్యాశాఖ మరోవారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియను పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ.

New Update
Telangana: తెలంగాణ డీఎస్సీ వాయిదా.. మళ్లీ పరీక్ష ఎప్పుడంటే..

తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి ఆన్‎లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది.  రేపటి (అక్టోబర్ 21)తో ఆన్‎లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఈనేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరికొన్నిరోజులు పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన విద్యాశాఖ మరోవారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియను పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ.

ఇది కూడా చదవండి: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్-3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కాగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.38లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి దరఖాస్తుల సంఖ్య తక్కువగానే ఉండటంతో టీచర్ పోస్టుల పోటీ తక్కువగా ఉంటుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. కానీ రిజర్వేషన్ల వారీగా కోటాల ప్రకారం ఆశించినన్ని ఖాళీలకు నోటిఫికేషన్ రాలేదని..దాదాపు 15వేల పోస్టుల భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 5వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తుండటంతో అభ్యర్థుల నుంచి స్పందన లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 10రోజుల పాటు సీబీఆర్టీ విధానంలో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఈ పరీక్షలు వాయిదా వేశారు. మరోవైపు బీఈ, బీటెక్ తోపాటు బీఈడీ ఉన్న అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులకు అర్హులేనని ఈ మధ్యే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది కూడా చదవండి: హైకోర్టు ఆర్డర్.. తెలంగాణ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్..

కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు, 1739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 611 భాషా పండితులు, 164 ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు