TS : వాహనదారులకు అలర్ట్.. పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ నేడే లాస్ట్

తెలంగాణలో ప్రభుత్వం కల్పించిన పెండింగ్ చలాన్ల డిస్కౌంట్ ఆఫర్ నేటితో ముగియనుంది. బకాయిలున్న వాహనదారులు వెంటనే క్లియర్ చేసుకోవాలని, రేపటినుంచి నమోదయ్యే జరిమానాలను వందశాతం కట్టాల్సివుంటుందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకూ రూ.80 కోట్లు వసూల్ అయినట్లు తెలుస్తోంది.

New Update
Pending Challans: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలు మాత్రమే!

Telangana : తెలంగాణ(Telangana) వాహనదారులకు అలర్ట్. పెండింగ్ చలాన్ల(Pending Challans)పై ప్రభుత్వం కల్పించిన డిస్కౌంట్ ఆఫర్(Discount Offer) నేటితో ముగియనుంది. వాహనదారులు భారీ మొత్తంలో రాయితీతో డిసెంబర్ 26నుంచి జనవరి 10వరకూ పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు పోలీసు ఉన్నతాధికారులు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజుతో ముగియనుండగా రేపటినుంచి వందశాతం ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

వంద కోట్ల ఆదాయం..
ఈ మేరకు ద్విచక్రవాహనాలకు, ఆటోలకు 80, ఆర్టీసీ బస్సు(TSRTC) లకు 90, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించగా.. ఇప్పటివరకూ ప్రభుత్వానికి దాదాపు రూ.80 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు ఆఖరి రోజు కావడంతో మిగిలిన వారు కూడా చెల్లిస్తే వంద కోట్ల ఆదాయం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే ఎక్కువ మంది పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నారని, అత్యధికంగా పట్టణాల్లోనే వసూల్ అయినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Telangana:రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

గతేడాది రూ.300 కోట్లు..
గతేడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్ల ఆదాయం సమకూరిన సంగతి తెలిసిందే. కాగా ప్రభుత్వం కల్పించిన ఈ రాయితీని సద్వినియోగం చేసుకోని వారి నుంచి పెండింగ్‌ ఇ-చలాన్ల(E-Challans) కు సంబంధించి పూర్తి జరిమానా వసూలు చేయనున్నారు. ఈ చలాన్లను మీసేవతో పాటు యూపీఐ(UPI) ద్వారా చెల్లించవచ్చు. ఏమైనా సందేహాలుంటే 040-27852721, 8712661690 వాట్సాప్ నంబర్లలో అధికారులను సంప్రదించవచ్చని ట్రాఫిక్ విభాగం పేర్కొంది. ఇక సైబర్‌ నేరస్థులు(Cyber Criminals) నకిలీ వెబ్‌సైట్‌తో వాహనదారులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని, చలానాల చెల్లింపులో ఎలాంటి సందేహాలు ఎదురైనా వెంటనే సంప్రదించాలని పోలీసులు సూచించారు.

Advertisment
తాజా కథనాలు