TS TET Applications Online : తెలంగాణ టెట్(TS TET) ఆన్ లైన్ అప్లికేషన్లు(Online Applications) శనివారంతో ముగియనున్నాయి. అర్హత గల అభ్యర్థులు ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఓ మారు గడువు పెంచడంతో మరోసారి పెంచే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం… ఏప్రిల్ 10వ తేదీనే ముగియాల్సి ఉంది. కానీ పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల వల్ల ఈతేదీని ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఫలితంగా శనివారంతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ లింక్ పై క్లిక్ చేస్తే https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు నిర్ణయించిన ఫీజును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా ఏమైనా తప్పులు చేస్తే వెంటనే సరి చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం వెబ్ సైట్ లో ఎడిట్ ఆప్షన్ ను చేర్చినట్లు తెలిపారు. ఈ ఆప్షన్ ను ఉపయోగించుకోని వెంటనే ఎడిట్ చేసుకోవాలని… ఈ గడువు కూడా ఏప్రిల్ 20వ తేదీతోనే క్లోజ్ కానుందని స్పష్టం చేశారు.
Also read: హైదరాబాద్ లో భారీ వర్షం!