/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-55-1-jpg.webp)
Congress 6 Guarantees Application Form: ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అప్లికేషన్ ఫారమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటీ శ్రీనివాస్ ఈ ఫారమ్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. అర్హులైన ప్రజలందరికీ పథకాలు అందేలా చూస్తామన్నారు. ఈ ఫారమ్ లు డిసెంబర్ 28నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ సభల్లో ధరఖాస్తులు తీసుకుంటామని సీఎం చెప్పారు. అర్హులైన లబ్ది దారలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. నిస్సహయులకు సంక్షేమం అందిచడమే తమ ప్రభుత్వం లక్ష్యమని రేవంత్ అన్నారు. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వెళ్లడం ద్వారా న్యాయం జరగుతుందని, ఇది ప్రజల ప్రభుత్వమనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలన్నారు. గతంలో గడీల్లో జరిగిన పాలనకు మేము ప్రజల దగ్గరకు తీసుకెళ్తున్నాం. లబ్ది దారుల వివరాలు ప్రభుత్వం దగ్గరుంటే టార్గెట్ పెట్టుకుని పని చేయొచ్చు అన్నారు. మేము టార్గెట్ ను చేరేందుకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. ప్రతి మండలాన్ని రెండు గ్రూపులుగా విభజిస్తాం. ఒక గ్రూపును తహసిల్దార్, మరో గ్రూపునకు ఎంపీడీవో నేతృత్వం వహిస్తారు. గ్రామ సభల్లో అప్లికేషన్స్ ఇవ్వలేకపోతే గ్రామ పంచాయితీలోనూ ఇవ్వొచ్చని తెలిపారు. అలాగే రేపటినుంచే గ్రామ సభలు నిర్వహిస్తామని, అన్ని గ్రామాలకు గ్యారంటీ ధరఖాస్తులు పంపంచామన్నారు.
ఇది కూడా చదవండి : BREAKING : ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫామ్.. డౌన్లోడ్ చేసుకోండి!
ఇప్పటికే 6 గ్యారంటీల్లో 2 అమల్లోకి తీసుకొచ్చాం. మిగతా నాలుగు గ్యారంటీలకోసం అప్లికేషన్స్ విడుదల చేశాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అర్హులైన వారందరికీ పథకాలు తప్పకుండా అందిస్తాం. ప్రజలకు గత ప్రభుత్వం ఎంత దూరంగా ఉందో ప్రజావాణిలో స్పష్టంగా కనిపించిందన్నారు. మారు మూల పల్లె వరకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యంమని చెప్పారు. తండాలు, గ్రామాల్లోనూ పేదల దగ్గరికి పాలన అందిస్తాం. ప్రజావాణిలో వచ్చిన అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ప్రజలు హైదరాబాద్ వరకు వచ్చే ఇబ్బంది రాకుండ ఉండేలా.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు పోవాలి అని నిర్ణయం తీసుకున్నామని సీఎం చెప్పారు.
అలాగే ఎవరికోసం ఎదురుచూడకండి. ఎవరి దగ్గరకు వెళ్లకండి. నేరుగా సంబంధిత అధికారులనే కలవాలని సూచించారు. కేటీఆర్ దగ్గరున్న లక్ష కోట్లను ప్రజలకు పంపిస్తామన్నారు. సభలో చెప్పుకోలేనివి ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు.