Telanganaelection2023 : బీజేపీలో చిచ్చు పెట్టిన జనసేన..పొత్తుపై తీవ్ర వ్యతిరేకత..!!

తెలంగాణలో రాజకీయం శరవేగంగా మారుతోంది. కొత్త కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీతో జనసేన పొత్తును ఓ వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నరు. లీడర్, కేడర్ లేని పార్టీతో పొత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు కొంతమంది ఆశావాహులు.

New Update
Telanganaelection2023 : బీజేపీలో చిచ్చు పెట్టిన జనసేన..పొత్తుపై తీవ్ర వ్యతిరేకత..!!

తెలంగాణలో రాజకీయలు రోజురోజూ మారుతున్నాయి. కొత్త కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీ-జనసేన కలిపి పోటీ చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కానీ సీట్లపై చర్చలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే జనసేన అడుగుతున్న సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. జనసేన పట్టు పడుతున్న సీట్లను ఇచ్చేందుకు బీజేపీ నేతలు ససేమీరా అంటున్నారట. కాగా వర్గం నేతలు మాత్రం జనసేనతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయట. లీడర్, కేడర్ లేని పార్టీతో పొత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారట కొంతమంది బీజేపీ ఆశావాహులు. జనసేనతో పొత్తు అనేది తీవ్ర నష్టం వాటిల్లుతుందని అసమ్మతి వర్గం ఆరోపిస్తుందట.

ఇది కూడా చదవండి: మిర్యాలగూడ గడ్డ..కమ్యూనిస్టుల అడ్డ.. గెలుపు మాదే …ఆర్టీవీ ఇంటర్వ్యూలో జూలకంటి రంగారెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

ఇందులో భాగంగా కూకట్ పల్లి సీటు జనసేన పొత్తులోకి వెళ్తుందన్న వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో బీజేపీకి చాలామంది నేతలు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొంతమంది నేతలు రాజీనామాకు సిద్ధమయ్యారు. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇలా బీజేపీ నుంచి కార్యకర్తలు, నేతలు బయటకు వెళ్లడం...అధిష్టానం పెద్దలకు ఇబ్బందిగా మారిందట. ఈ తరుణంలో కిషన్ రెడ్డి, జవదేకర్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ హాజరై సమావేశం అయ్యారు. ఈ పొత్తు విషయంపై ఈ రోజు కానీ రేపు కానీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోందని సమాచారం.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు శుభవార్త.. మరో 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Advertisment
తాజా కథనాలు