Indigo Flight: కొద్ది రోజుల క్రితం ముంబై ఎయిర్ పోర్టు(Mumbai Airport) లో రన్ వే (Run Way) పై విమానం పక్కన కూర్చొని ప్రయాణికులు భోజనం చేసిన ఘటన పై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) తీవ్రంగా పరిగణించింది. ఈ నిర్వాకానికి పాల్పడిన దిగ్గజ విమానసంస్థ ఇండిగోకు (Indigo) రూ. 1.2 కోట్ల జరిమానా విధించింది.
ఇటీవల గోవా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని వాతావరణం అనుకూలించక ముంబైకి తిప్పడం జరిగింది. దాంతో అక్కడే ప్రయాణికులు కొన్ని గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రయాణికులకు భోజనాన్ని ఏర్పాటు చేశారు. అయితే విమానం పక్కనే రన్ వే పై కూర్చొని భోజనం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్..
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ముంబై ఎయిర్ పోర్టుకి ఈ విషయం గురించి రూ. 30 లక్షలు జరిమానా విధించింది. ఈ వీడియో పై ఇండిగో, ముంబై విమానాశ్రయానికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా పొగమంచు కమ్మేస్తుంది. ఢిల్లీతో పాటు ముంబై లాంటి ప్రాంతాల్లో కూడా పొగమంచు బాధ చాలా ఎక్కువగా ఉంది.
దీంతో చాలా విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు దారి మళ్లి నడుస్తున్నాయి. దీంతో చాలా మంది ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొందరైతే పైలట్లు, ఎయిర్ హోస్టేస్ ల మీద దాడులు కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. విమానాలు ఆగి ఉండే స్థలంలో ప్రయాణికులు విమానం పక్కనే కూర్చొని నేల మీదే భోజనాలు చేస్తున్నారు. దానిని ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అవ్వడంతో పాటు అధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో విమాన సంస్థ ఇండిగోకు భారీ మొత్తంలో జరిమానా విధించడం జరిగింది.
Also read: శ్రీవారి భక్తులకు అలర్ట్..నేటి నుంచి సేవా, దర్శన టికెట్లు విడుదల!