Budget 2024: రైతులకు అదిరిపోయే వార్త..మధ్యంతర బడ్జెట్‌ 2024లో కేంద్రం కీలక నిర్ణయం..!!

మధ్యంతర బడ్జెట్లో వ్యవసాయరంగంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2024 బడ్జెట్లో రూ. 22లక్షల కోట్ల నుంచి రూ. 25లక్షల కోట్ల వరకు పెంచేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రైతులకు రుణ సదుపాయం, సౌలభ్యం పెరగనుంది.

PM Modi: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్!
New Update

Budget 2024:  మనదేశంలో ఎక్కవ మంది వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తారు. ప్రభుత్వాలు రైతు సంక్షేమానికి, వ్యవసాయఅభివ్రుద్ధికి పెద్దపీట వేస్తాయి. రైతులకు తోడ్పాటు అందించేందుకు రాయితీలపై రుణాలు అందిస్తాయి. అయితే రానున్న ఆర్థిక ఏడాదికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 2024 మధ్యంతర బడ్జెట్ లో రూ. 22 లక్షల కోట్ల నుంచి రూ. 25లక్షల కోట్ల వరకు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. దీంతో రైతులకు రుణ సదుపాయం తో రైతులకు మేలు జరగనుంది.

అయితే ప్రస్తుత ఆర్దిక సంవత్సరం వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 20 లక్షల కోట్లు మాత్రమే.ఉండగా..అర్హులైన రైతులకు రుణ సౌలభ్యాన్ని కొనసాగించేందుకు లక్ష్యాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ 2024లో ఆశిస్తున్న మార్పులు, అంచనాలను ఓ సారి చూద్దాం.

2023 డిసెంబర్ నాటికి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం రూ. 20లక్షల కోట్ల అగ్రి క్రెడిట్ లక్ష్యంలో దాదాపు 82శాతం సాధించినట్లు ప్రభుత్వ డేటా సూచిస్తుంది. ఈ కాలంలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులకు రూ. 16.37లక్షల కోట్లు పంపిణీ చేసింది. అయితే ఈ సారి బడ్జెట్లో వ్యవసాయ రుణాల పంపిణీ అనుకున్నదానికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.2022-23 కాలంలో మొత్తం వ్యవసాయ రుణాల పంపిణీ రూ.21.55లక్షల కోట్లు ఉండగా ఇది రూ. 18.50లక్షల కోట్ల లక్ష్యాన్ని అధిగమించింది. అదనంగా మరో 3.05లక్షల కోట్లు చేరింది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 7.34కోట్ల మంది రైతులు రుణాలు పొందాలని నివేదికలు చెబుతున్నాయి.

ఇది కూడా చదవండి : అయోధ్యారాముడికి కొత్తపేరు..ఇక నుంచి ఆపేరుతోనే దర్శనం..!!

ప్రభుత్వం అన్ని అర్థిక సంస్థలకు రూ. 3లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై 2శాతం వడ్డీ రాయితీని ఇస్తుంది. దీంతో రైతులు ఏడాదికి 7శాతం వడ్డీ రేటుతోపాటు రూ. 3లక్షల వరకు వ్యవసాయ రుణాలు తీసుకునే అవకాశం ఉంది. అర్హులైన రైతులకు గుర్తించి వారికి క్రెడిట్ నెట్ వర్క్ లో చేర్చే లక్ష్యంతో ప్రభుత్వం పలు కార్యక్రమాలను కూడా చేపడుతోంది. వ్యవసాయ రుణంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వ్యవసాయ విధానంలో  భాగంగా రుణం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.

#2024-budget-expectations #budget-2024 #union-budget-2024 #agricultural-credit-target
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి