Maldives: మాల్దీవులతో భారత్ ఒప్పందం..

భారత్-మాల్దీవుల మధ్య చిచ్చు పెట్టడానికి చైనా చాలా ప్రయత్నాలు చేసింది. కొంతవరకూ అందులో విజయం సాధించింది. అయితే, చైనాకు షాక్ ఇచ్చేలా భారత విదేశాంగ శాఖ మంత్రి మూడురోజుల మాల్దీవుల పర్యటన సాగింది. ఈ పర్యటనలో మాల్దీవుల్లో యూపీఐ పేమెంట్స్ ప్రారంభించడానికి ఒప్పందం కుదిరింది.  

New Update
Maldives: మాల్దీవులతో భారత్ ఒప్పందం..

Maldives: మాల్దీవుల ప్రస్తుత ప్రభుత్వాన్ని భారత్‌పై రెచ్చగొట్టేందుకు చైనా చాలా ప్రయత్నాలు చేసింది. ఇందులో చాలా వరకు విజయం సాధించింది కూడా. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతినడం ప్రారంభించాయి. భారతదేశం కూడా అక్కడ ఉన్న తన సైన్యాన్ని వెనక్కి పిలవాల్సి వచ్చింది. ఇప్పుడు భారత విదేశాంగ మంత్రి (External Affairs Minister of India) మాల్దీవుల పర్యటన పొరుగు దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో కొత్త అధ్యాయాన్ని రాయడం ప్రారంభించింది.

Maldives: మాల్దీవుల్లో అధికార మార్పిడి జరగడం ప్రారంభం అయిన దగ్గర నుండి భారత్ -మాల్దీవుల (India - Maldives) మధ్య సంబంధాలు సరిగ్గా లేవు. ఈ సంబంధాలను మరింత దిగజార్చేందుకు చైనా కూడా చాలా ప్రయత్నాలు చేసింది. భారత్ తన సైన్యాన్ని కూడా మాల్దీవుల నుంచి వెనక్కి పిలిపించుకోవాల్సి వచ్చింది. ఇది భారత్‌పై దౌత్యపరమైన విజయంగా చైనా (China) భావిస్తోంది. అయితే, ఇప్పుడు చైనా కూడా నమ్మలేని విధంగా మాల్దీవులతో భారత్ ఒక  ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల భారత్‌కు ఎంత ప్రయోజనం ఉంటుంది? మాల్దీవులకు ఎంత లబ్ది ఉంటుంది? భారత్, మాల్దీవుల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరిందో కూడా చెబుతాం.

ఈ ఎంఓయూపై సంతకాలు..
Maldives: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ఇక్కడ ప్రారంభించేందుకు భారత్-మాల్దీవులు ఒప్పందంపై సంతకం చేశాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S. Jaishankar) తెలిపారు. ఈ ఒప్పందం మాల్దీవుల పర్యాటక రంగంపై చాలా సానుకూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. జైశంకర్ మాల్దీవుల్లో మూడు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 

మన దేశంలో UPI విప్లవాన్ని తెచ్చింది..
Maldives: NPCI అభివృద్ధి చేసిన UPI అనేది మొబైల్ ఫోన్‌ల ద్వారా బ్యాంకుల మధ్య లావాదేవీలను సులభతరం చేయడానికి.. రియల్ టైమ్ పేమెంట్ వ్యవస్థ. తన మాల్దీవుల పర్యటనలో అక్కడ ముసా జమీర్‌తో సమావేశమైన తర్వాత విలేకరుల సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ, భారతదేశం తన UPI ద్వారా డిజిటల్ లావాదేవీలను విప్లవాత్మకంగా మార్చిందని అన్నారు. భారతదేశంలో ఆర్థిక చేరిక కొత్త స్థాయికి చేరుకుందని జైశంకర్ ఉద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచంలోని రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 40 శాతం మన దేశంలోనే జరుగుతున్నాయని వివరించారు. 

మాల్దీవులలో పర్యాటకం చాలా ముఖ్యం..
మాల్దీవులలో ఆర్థిక కార్యకలాపాలకు పర్యాటకం ప్రధాన వనరు. ఇది దేశ స్థూల దేశీయోత్పత్తికి (GDP) 30 శాతం దోహదం చేస్తుంది.  60 శాతానికి పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకువస్తుంది.  మాల్దీవులతో ద్వైపాక్షిక సంబంధాలను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడమే జైశంకర్ పర్యటన లక్ష్యం. మాల్దీవుల చైనా అనుకూల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు గత ఏడాది పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ వైపు నుంచి జరిగిన అత్యున్నత స్థాయి పర్యటన ఇదే.

చైనాకు తలనొప్పి
Maldives: మరోవైపు మాల్దీవులు, భారత్‌ల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం చైనాకు మరోసారి పెద్ద తలనొప్పిగా మారింది. మాల్దీవుల ప్రస్తుత ప్రభుత్వాన్ని భారత్‌పై రెచ్చగొట్టేందుకు చైనా చాలా ప్రయత్నాలు చేసింది. ఇందులో చాలా వరకు విజయం సాధించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతినడం ప్రారంభించాయి. భారతదేశం కూడా తన సైన్యాన్ని వెనక్కి పిలవవలసి వచ్చింది. ఇప్పుడు భారత విదేశాంగ మంత్రి మాల్దీవుల పర్యటన పొరుగు దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో కొత్త అధ్యాయాన్ని రాయడం ప్రారంభించింది. UPIకి సంబంధించిన ఒప్పందం అందులో ఒక భాగం మాత్రమే. ఇప్పుడు చైనా నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు