Anantapur : షేర్ మార్కెట్(Share Market) లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు తీర్చేందుకు ఒక మహిళ(Woman) ను హత్య చేసిన నిందితుని అనంతపురం జిల్లా(Anantapur District) పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారం లేకపోయినా కేవలం రెండు రోజులు వివధులోనే నిందితుని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి వెల్లడించారు. నార్పల మండలం బండ్లపల్లి పప్పూరుకి చెందిన లక్ష్మీనారాయణమ్మ అనే 52 ఏళ్ల మహిళ ఈనెల 3న హత్యకు గురైంది. ఈమెను గుర్తు తెలియని వ్యక్తులు చంపి అరటి తోటలో పూడ్చిపెట్టారు.
Also Read : ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. జగన్, చంద్రబాబులకు షర్మిలా లేఖ
లక్ష్మీనారాయణమ్మ అన్న రమణయ్య తన చెల్లెలు కనపడలేదని నార్పల(Narpala) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. అసలు నిందితున్ని పట్టుకున్నారు. బండ్లపల్లి పప్పూరు గ్రామానికి చెందిన చల్లా నరేంద్ర అనే యువకుడు షేర్ మార్కెట్ల ద్వారా డబ్బులు పోగొట్టుకొని దాదాపు 5 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఒంటరిగా ఉన్న లక్ష్మీనారాయణమ్మ మెడలో గొలుసు లాక్కుని ప్రయత్నం చేశాడు.
Also Read : ఒకరితో ప్రేమ మరోకరితో శృంగారం.. చివరికి ఏమైందంటే!
తనను చూసిన ఆమె ఈ విషయాన్ని గ్రామంలో చెబుతుందని భయపడి బండరాయితో ఆమె తలపై మోది హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆమెను అరటి తోటలో పూడ్చి పెట్టాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన సర్కిల్ పోలీసులు నిందితున్ని పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు ఉంగరం ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు.