Crime News : షేర్ మార్కెట్ లో అప్పులు... మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్..! అనంతపురంలో ఒక మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు.షేర్ మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకొని దాదాపు 5 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు నరేంద్ర అనే యువకుడు. చేసిన అప్పులు తీర్చేందుకు లక్ష్మీనారాయణమ్మ మెడలోని గొలుసును లాక్కున్నాడు. అనంతరం భయపడి ఆమెను హత్య చేశాడు. By Jyoshna Sappogula 07 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Anantapur : షేర్ మార్కెట్(Share Market) లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు తీర్చేందుకు ఒక మహిళ(Woman) ను హత్య చేసిన నిందితుని అనంతపురం జిల్లా(Anantapur District) పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారం లేకపోయినా కేవలం రెండు రోజులు వివధులోనే నిందితుని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి వెల్లడించారు. నార్పల మండలం బండ్లపల్లి పప్పూరుకి చెందిన లక్ష్మీనారాయణమ్మ అనే 52 ఏళ్ల మహిళ ఈనెల 3న హత్యకు గురైంది. ఈమెను గుర్తు తెలియని వ్యక్తులు చంపి అరటి తోటలో పూడ్చిపెట్టారు. Also Read : ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. జగన్, చంద్రబాబులకు షర్మిలా లేఖ లక్ష్మీనారాయణమ్మ అన్న రమణయ్య తన చెల్లెలు కనపడలేదని నార్పల(Narpala) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా.. అసలు నిందితున్ని పట్టుకున్నారు. బండ్లపల్లి పప్పూరు గ్రామానికి చెందిన చల్లా నరేంద్ర అనే యువకుడు షేర్ మార్కెట్ల ద్వారా డబ్బులు పోగొట్టుకొని దాదాపు 5 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఒంటరిగా ఉన్న లక్ష్మీనారాయణమ్మ మెడలో గొలుసు లాక్కుని ప్రయత్నం చేశాడు. Also Read : ఒకరితో ప్రేమ మరోకరితో శృంగారం.. చివరికి ఏమైందంటే! తనను చూసిన ఆమె ఈ విషయాన్ని గ్రామంలో చెబుతుందని భయపడి బండరాయితో ఆమె తలపై మోది హత్య చేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆమెను అరటి తోటలో పూడ్చి పెట్టాడు. దీనిపై లోతుగా దర్యాప్తు చేసిన సర్కిల్ పోలీసులు నిందితున్ని పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి బంగారు గొలుసు ఉంగరం ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. #andhra-pradesh #anantapur #share-market #woman-murder-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి