Bombay High Court : లేని పాస్‌ పోర్టును పొందేందుకు నిందితునికి 4 నెలల గడువు!

నిందితునికి బెయిల్‌ ఇచ్చేందుకు గోవాలోని ఓ కోర్టు విధించిన షరతు..బాంబే హైకోర్టును విస్మయానికి గురి చేసింది. గోవా కోర్టు పెట్టిన షరతును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. షరతును సవరించాల్సిన జడ్జి పెట్టిన కొత్త షరతు పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

New Update
Bombay High Court : లేని పాస్‌ పోర్టును పొందేందుకు నిందితునికి 4 నెలల గడువు!

Bombay High Court : నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయడానికి గోవాలోని ఓ కోర్టు పెట్టిన షరతు.. బాంబే హైకోర్టు (Bombay High Court) ని ఆశ్చర్యానికి గురి చేసింది. హత్యాయత్నం కేసులో నిందితుడైన 18 ఏళ్ల యువకుడు ఈ ఏడాది ఏప్రిల్‌ లో గోవా (Goa) లో అరెస్టయ్యాడు. ఆ యువకుడు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు ఇతర షరతులతో పాటు..పాస్‌ పోర్టు కూడా సమర్పించాలని ఆదేశించింది.

అయితే నిందితుడు తనకు పాస్‌ పోర్ట్‌ (Passport) లేదని కోర్టుకు తెలియజేయగా..దానిని పొందడం కోసం నాలుగు నెలల సమయం ఇస్తున్నట్లు జడ్జి పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సవాల్‌ చేస్తూ ఆ యువకుడు బాంబే హైకోర్టుకు చెందిన గోవా ధర్మాసనాన్ని ఆశ్రయించాడు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ భరత్‌ దేశ్‌ పాండే ఏకసభ్య ధర్మాసనం..సెషన్స్‌ కోర్టు నిందితునికి విధించిన షరతు పై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

పాస్‌ పోర్టు లేదు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోని సవారించాల్సిన జడ్జి..4 నెలలు ఆ షరతును నిలిపివేయడం గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆ షరతును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

Also read: జెలన్‌ స్కీని పుతిన్‌ అని పరిచయం చేసిన బైడెన్ అన్న!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు