Indian Cricket Team : ఇంటర్నేషనల్ క్రికెట్(International Cricket) ఆడి, తర్వాత జట్టుకు దూరమైన చాలామంది భారత క్రికెటర్లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) లో సత్తా చాటుతున్నారు. భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ లైనప్‌లో కీలక ఆటగాళ్లు అందరూ ఐపీఎల్‌లో సక్సెస్ అవుతున్నారు. బౌలింగ్ వనరుల కోసం వెతుకుతున్న సెలక్టర్లకు కొత్త ఆప్షన్స్ కనిపిస్తున్నాయి.ఇక, ఐపీఎల్ 2024 సీజన్ కుర్రాళ్లకు ఓ వరం. ఇక్కడ సత్తా చాటితే టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024) బెర్తు దక్కడం పక్కా. ఐపీఎల్ 2024 తర్వాత పొట్టి ప్రపంచకప్ యూఎస్, కరేబియన్ వేదికగా జరగనుంది. దీంతో.. ఐపీఎల్ 2024 సీజన్‌లో సత్తా చాటి.. టీమిండియాలో చోటు దక్కించుకోవాలని కుర్రాళ్లు ఉవ్విల్లూరుతున్నారు.
ఐపీఎల్‌లో కొందరు కుర్రాళ్లు ఇప్పటికే లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఐపీఎల్ తర్వాత ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ సెలక్షన్స్‌లో వీరికి ప్రాధాన్యం దక్కవచ్చు. ఇక, వికెట్ కీపర్ స్థానం కోసం టీమిండియాలో చాలా పోటీ ఉంది. ముఖ్యంగా రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ రేసులో ముందున్నారు.అయితే.. ఇప్పుడు ఆ ఇద్దరికి తీవ్రపోటీ ఇస్తున్నాడు 38 ఏళ్ల ఆటగాడు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అతడు ఎవరో. ఆ ఆటగాడు ఎవరో కాదు.. ధనాధన్ దినేష్ కార్తీక్. ఈ ఐపీఎల్ సీజన్‌లో తన విశ్వరూపం చూపిస్తున్నాడు దినేష్ కార్తీక్.
లేటెస్ట్‌గా హైదరాబాద్(Hyderabad) తో జరిగిన మ్యాచులో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ(Kohli), డుప్లెసిస్ వికెట్లు పడి.. 200 స్కోరు కూడా దాటడం కష్టమనుకున్న సమయంలో డీకే ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. 38 ఏళ్ల దినేష్ కార్తీక్ ఇలా ఆడటం చూసి ఫిదా అయిన ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డీకే ఔట్ కాకుండా ఉంటే.. ఆర్సీబీ గెలిచేదని కామెంట్లు పెడుతున్నారు. డీకే ఆటను చూసి మరికొందరు అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
డీకే.. ఏడు మ్యాచులాడి 226 పరుగులు చేశాడు. అది కూడా ఆఖరి ఓవర్లలో బరిలోకి దిగి ఇంతటి విధ్వంసం సృష్టించాడు. అతని స్ట్రైక్ రేట్ 205.45. ఆర్సీబీలో మరే ఆటగాడికి కూడా ఇంత స్ట్రైక్ రేట్ లేదు.ఇక, వరల్డ్ కప్ జట్టులో కీపర్ స్థానం కోసం పోటీపడుతున్న పంత్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, ధృవ్ జురైల్, జితేష్ శర్మలు కూడా ఈ విషయంలో వెనుకంజలో ఉన్నారు. దీంతో.. దినేష్ కార్తీక్ దెబ్బకి పంత్, ఇషాన్ ప్లేసులు గల్లంతయ్యేలా ఉన్నాయని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Also Read : రికార్డుల మోత మోగించిన రాయల్ ఛాలెంజర్స్ vs సన్ రైజర్స్ మ్యాచ్