ఆ యాక్ట్ ల స్థానాల్లో కొత్త చట్టాలు... కీలక బిల్లులు ప్రవేశ పెట్టిన అమిత్ షా....!

దేశంలోని క్రిమినల్ చట్టాల్లో సమూలంగా మార్పులు తీసుకు వచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో శుక్రవారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలులో వున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు.

New Update
ఆ యాక్ట్ ల స్థానాల్లో కొత్త చట్టాలు... కీలక బిల్లులు ప్రవేశ పెట్టిన అమిత్ షా....!

దేశంలోని క్రిమినల్ చట్టాల్లో(criminal laws) సమూలంగా మార్పులు తీసుకు వచ్చేందుకు కేంద్రం(Union governament) నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో శుక్రవారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలులో వున్న ఇండియన్ పీనల్ కోడ్(Ipc), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(crpc), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌(indian evidence act) లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు.

బిల్లుల గురించి అమిత్ షా ఏమన్నారంటే...!

దేశంలో బానిస మనస్తత్వానికి ముగింపు పలకాలని ప్రధాని మోడీ భావిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే దేశంలో బ్రిటీష్ వారు తీసుకు వచ్చిన ఐపీసీ (1857), సీఆర్పీసీ(1858), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లకు తాము ముగింపు పలకాలని అనుకుంటున్నామని చెప్పారు. వివాదాస్పద దేశ ద్రోహ చట్టాన్ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన నిబంధనలు ఈ బిల్లులో వున్నాయని అమిత్ షా వెల్లడించారు. ఆయా బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతామని తెలిపారు.

ఆ బిల్లుల స్థానంలో కొత్త బిల్లులను తీసుకు వస్తామన్నారు. ప్రజలకు శిక్ష విధించే ఉద్దేశంతో కాకుండా న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఈ చట్టాలను తీసుకు రాబోతున్నట్టు వివరించారు. దేశంలో కోర్టులకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు. కోర్టులకు వెళ్లడమంటే అది ఒక శిక్షలాగా ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు.

ఆ యాక్ట్ ల స్థానాల్లో మూడు కొత్త చట్టాలు...!

ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత తీసుకు వస్తామన్నారు. గతంలో 511 సెక్షన్లు ఉండేవన్నారు. ఇప్పుడు వాటి స్థానంలో 356 సెక్షన్లు మాత్రమే వుంటాయన్నారు. 175 సెక్షన్లను సవరించామన్నారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య చట్టాలను తీసుకు వస్తున్నట్టు చెప్పారు.

దేశ ద్రోహ చట్టం స్థానంలో సెక్షన్ 150...!

దేశ ద్రోహ చట్టాన్ని(sedition) రద్దు చేయనున్నారు. ప్రతిపాదిత చట్టాల్లో దేశ ద్రోహం అనే పదాన్ని తొలగించనున్నట్టు అమిత్ షా వెల్లడించారు. దాని స్థానంలో సెక్షన్ 150 ని తీసుకు వస్తామన్నారు. దేశ సార్వ భౌమత్వానికి, సామరస్యానికి ప్రమాదం కలిగించే చర్యలను ఈ నిబంధన ద్వారా నేరంగా పరిగణించనున్నట్టు తెలిపారు. గతంలో దేశ ద్రోహానికి పాల్పడితే గరిష్టంగా మూడేండ్ల జైలు శిక్ష పడేదన్నారు. కానీ కొత్త నిబంధన ప్రకారం 7 ఏండ్ల శిక్ష విధించనున్నారు.

కొత్త చట్టాల్లో వేటికి ఏ శిక్షలంటే...!

కొత్త చట్టాల్లో నేరం తీవ్రతను బట్టి మూక దాడికి ఏడేండ్ల జైలు శిక్ష విధించనున్నట్టు బిల్లులో తెలిపారు. ఇక కొత్త చట్టాల్లోనూ మరణ శిక్షను అలాగే కొనసాగించనున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తే నేరంగా పరిగణించి ఒక ఏడాది వరకు జైలు శిక్ష విధించనున్నారు. కొత్త చట్టాల్లో మహిళలు, చిన్నారుల రక్షణ చట్టాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. కమ్యూనిటీ సర్వీస్ అనే కొత్త శిక్షను దేశంలో తీసుకు రానున్నారు. చిన్న చిన్న నేరాలకు (petty offenses )కు కస్టడీయేతర(non-custodial punishment)శిక్షను ఇందులో విధించనున్నారు.

Advertisment
తాజా కథనాలు