ఆ యాక్ట్ ల స్థానాల్లో కొత్త చట్టాలు... కీలక బిల్లులు ప్రవేశ పెట్టిన అమిత్ షా....!
దేశంలోని క్రిమినల్ చట్టాల్లో సమూలంగా మార్పులు తీసుకు వచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పార్లమెంట్లో శుక్రవారం కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలులో వున్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రవేశ పెట్టారు.