/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/GAMECHANGER-jpg.webp)
Game Changer: ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తదుపరి చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రోబో 2.0 చిత్రం తర్వాత శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలై చాలా రోజులు అవుతుంది. కానీ షూటింగ్ మాత్రం నత్తనడకన సాగుతుంది. వివిధ కారణాల వల్ల చిత్రీకరణ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ నెలలో జరగాల్సిన షూటింగ్ పార్ట్ క్యాన్సిల్ అయిందనే వార్త మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఇప్పటికే చిత్రీకరణ లేట్ అవుతుందన్న బాధపడుతున్న అభిమానులను ఈ వార్త మరింత్ర నిరాశకు గురిచేసింది. దీంతో చిత్ర యూనిట్‌పై నిరాశ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై తాజాగా చిత్ర నిర్మాత సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్విట్టర్ వేదికగా స్పందించింది. “కొందరు నటులు అందుబాటులో లేకపోవడం వల్లే గేమ్ ఛేంజర్ మూవీ సెప్టెంబర్ షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ రెండో వారంలో చిత్రీకరణ మళ్లీ ప్రారంభం కానుంది” అని అందులో పేర్కొంది. దాంతో చిత్రం షూటింగ్ త్వరగా పూర్తి చేసి విడుదల చేయాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
The September schedule of #GameChanger has been cancelled only due to few artists’ unavailability. The shoot will resume in the second week of October.
- Team Game Changer.
— Sri Venkateswara Creations (@SVC_official) September 24, 2023
మరోవైపు శంకర్ ఇండియన్2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. లోకనాయకుడు కమలహాసన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. 1990ల్లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌గా ఇది తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిందట. ఈ నేపథ్యంలో ఇక నుంచి శంకర్ గేమ్‌ఛేంజర్ మూవీపైనే ఫుల్ ఫోకస్ పెట్టనున్నారట. చిత్రీకరణ త్వరగా పూర్తిచేసి త్వరలోనే థియేటర్లలోకి తెచ్చేందకు కృషిచేస్తున్నారని చెబుతున్నారు.
కాగా గేమ్‌ఛేంజర్ సినిమాలో తొలిసారి చరణ్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు. చెర్రీకి తోడుగా కియారా అద్వానీ నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి లీక్ అయిన ఓ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇప్పటివరకు విడుదలైన మూవీ ఫస్ట్ లుక్స్ కూడా సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి.
ఇది కూడా చదవండి: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, నయనతార